
ప్రజా నాయకుడు పెద్దిరెడ్డి
చౌడేపల్లె : పేదల సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన కుటుంబంపై కక్షసాధింపులకు దిగుతున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. బుధవారం ఈ మేరకు చారాల సమీపంలోని అన్నపూర్ణాంబ సమేత కాశీవిశ్వేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. దామోదరరాజు, మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీలు సుధాకర్‌రెడ్డి, నరసింహులు యాదవ్,మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, అంజిబాబు మాట్లాడుతూ పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టడంతోపాటు ఎల్లో మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అండతో వైఎస్సార్‌సీపీనేతలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతోందని ఆరోపించారు. నేతలను అన్యాయంగా జైలు పాలు చేస్తోందని మండిపడ్డారు. కుట్రలు వదిలేసి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందేవని గుర్తుచేశారు. సూపర్‌సిక్స్ పథకాలను అరకొరగా అమలు చేస్తూ గొప్పలు చెప్పుకోవడం తప్ప కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు చేసింది శూన్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఆడెం హరిబాబు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెంకటరమణ, నేతలు లడ్డూ రమణ, అమర, రమణారెడ్డి, ,శివశంకర్‌రెడ్డి ,మునిరాజా ,ప్రమోద్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, వీరప్పాచారి, సుబ్రమణ్యం, రామచంద్ర, రవికుమార్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం కార్యదర్శి కల్యాణ్‌భరత్, కో–ఆప్షన్ మెంబర్ సాధిక్, బోయకొండ మాజీ డైరెక్టర్ నాగరాజా, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రమేష్‌బాబు, యశోద, అనుప్రియ పాల్గొన్నారు.