
తప్పని నిరీక్షణ
ఉదయం 11 దాటినా కానరాని వైద్యులు ఆపసోపాలు పడిన అభాగ్యులు
కార్వేటినగరం: అసలే దివ్యాంగులు. ఆపై వందల కిలోమీటర్ల ప్రయాణం. ఆపసోపాలు పడి తమకు సూచించిన ఆస్పత్రికి తరలివచ్చారు. తమ వికలత్వాన్ని పరీక్షించుకుని సర్టిఫికెట్లు పొందాలని ఆశపడ్డారు. కానీ స్థానిక పీహెచ్‌సీ డాక్టర్లు ఉదయం 11 దాటినా రాకపోవడంతో నిరుత్సాహంతో కుమిలిపోయారు.
డాక్టర్లు లేక ఖాళీ కుర్చీలతో సదరమ్ క్యాంపు గది
కార్వేటినగరం వచ్చిన దివ్యాంగులు
ధర్మవరం నుంచి వచ్చాము
మాది అనంతపురం జిల్లా, ధర్మవరం గ్రామం. మేము సదరమ్ సర్టిఫికెట్ల కోసం మూడు నెలలకు ముందు స్లాట్ బుక్ చేసుకున్నాము. మాలాంటి వారికి వందల కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఆలస్యంగా బుక్ చేసుకున్న వారికి దగ్గర్లో ఉన్న ఆస్పత్రుల్లో అనుమతులిచ్చారు. కష్టాలకోర్చి ఇంత దూరం వచ్చాము. ఉదయం 11 గంటలవుతున్నా ఇంతవరకు వైద్యులు రాలేదు. సీహెచ్‌సీలో 12 మంది డాక్టర్లు ఉన్నా ఏ ఒక్కరూ సమయపాలన పాటించలేదు.
– హరిప్రసాద్, ధర్మవరం, అనంతపురం జిల్లా
సదరమ్ సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల ఎదురు చూపు

తప్పని నిరీక్షణ

తప్పని నిరీక్షణ