
గజ గణపతి!
గజ వాహనంపై గణనాథుడు
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం గజ వాహనంపై ఊరేగుతూ స్వామివారు కనువిందు చేశారు. ఉదయం శ్రీసిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సర్వంగా సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. రాత్రి అలంకార మండపంలో గణనాథుని ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించి గజ వాహనంపై కొలువు దీర్చారు. పురవీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగింపు చేపట్టారు.
రథోత్సవానికి సర్వం సిద్ధం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.