
అత్యవసర సేవలకు ప్రథమ ప్రాధాన్యం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు అత్యవసర సేవలందించడం ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో మంగళవారం నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాత అంబులెన్స్‌ల స్థానంలో కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చి అత్యవసర సేవలందించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి సంబంధించి పాత అంబులెన్స్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఏవోసీఎల్ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ పథకంలో కొత్త అంబులెన్స్‌ను త్వరలో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్‌ల సంఖ్య మూడుకు చేరుతుందన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, మేయర్ అముద, ఎన్టీఆర్ వైద్య సేవ కో–ఆర్డినేటర్ డా.సుదర్శన్ పాల్గొన్నారు.