
ఎట్టకేలకు కంచె
పుంగనూరు: పట్టణంలోని పీఎల్‌ఆర్ మినీబైపాస్ రోడ్డులో గల రాయలచెరువు వంకపోరంబోకు స్థలానికి ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో కంచె ఏర్పాటు చేశారు. మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కాగా గత నెల 25న ‘వంకపోరంబోకు స్థలం కబ్జా’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై తహసీల్దార్ స్పందించి ట్రెంచ్ ఏర్పాటు చేశారు. కమిషనర్ స్థలాన్ని పరిశీలించి సర్వే నం.110/1లోని 81 సెంట్లు కబ్జా కాకుండా తక్షణమే కంచె ఏర్పాటు చేశారు. ఇందులో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు.

ఎట్టకేలకు కంచె