ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా రూపేష్‌బాబు | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా రూపేష్‌బాబు

Sep 3 2025 4:29 AM | Updated on Sep 3 2025 4:29 AM

ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా రూపేష్‌బాబు

ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా రూపేష్‌బాబు

చిత్తూరు కలెక్టరేట్‌ : చైన్నెలోని జీవ టెక్నిలాజికల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా చిత్తూరుకు చెందిన డాక్టర్‌ రూపేష్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఝాన్సీరాణి ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ పరిశ్రమల అభివృద్ధి సాధికారిక సంస్థ (అపిట్‌కో) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రూపేష్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన రూపేష్‌బాబు సేవలను వినియోగించుకోవాలని జీవ టెక్నిలాజికల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ భావించినట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌గా నియమితులైన రూపేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానన్నారు. పలువురు జిల్లా వాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 15 మందికి జరిమానా

చిత్తూరు అర్బన్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందికి రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్‌ సీఐ లక్ష్మీనారాయణ రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 15 మందిపై కేసు నమోదుచేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

గంజాయి విక్రయించిన వ్యక్తి అరెస్ట్‌

చిత్తూరు అర్బన్‌: గంజాయి విక్రయిస్తూ, తనిఖీల సమయంలో తప్పించుకున్న రాజా (45)ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. జూలై 19న నగరంలోని కై లాశపురం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి, 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రాజా అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోయాడు. ఇతడిని పోలీసులు అరెస్టుచేసి, న్యాయస్థానం ఆదేశాలతో చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.

జిల్లాలో 24 ఆర్‌ఎంపీ క్లినిక్‌ల సీజ్‌

కాణిపాకం: కలెక్టర్‌ ఆదేశాలకు జిల్లా వ్యాప్తంగా ఆర్‌ఎంపీ క్లినిక్‌లపై మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 76 క్లినిక్‌లను తనిఖీ చేసి.. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 24 ఆర్‌ఎంపీ క్లినిక్‌ల ను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసే క్రమంలో వైజాగ్‌ అధికా రులు పలు విషయాలను గుర్తించారు. వాటిని త్వరలో కలెక్టర్‌కు నివేదికల రూపంలో పంపనున్న ట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement