
అర్జీ ఆవేదన
పరిష్కారం కాని సమస్యలు పేరుకుపోతున్న అర్జీలు పట్టించుకోని క్షేత్ర స్థాయి అధికారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ప్రజలు చోద్యం చూస్తున్న కూటమి నేతలు
‘సమస్యలతో చచ్చి బతుకుతున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పాలకులూ కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులుకై నా గోడు విన్నవిస్తే పరిష్కారమవుతుందనే చిన్న ఆశతో.. సచ్చుబడిన కాళ్లను ఒడిసిపట్టుకుని.. కడుపు మాడ్చుకుని కుటుంబీకుల సహాయంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. చెప్పులరిగేలా చక్కెర్లు కొడుతున్నాం. అర్జీలిచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నాం. వారం వారం తిరిగి..తిరిగి అలసిపోతున్నాం. పెద్ద మనసుతో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని అధికారుల కాళ్లు పట్టుకుంటున్నాం. కానీ ఏం లాభం..? ఏ ఒక్కరూ కనికరించడం లేదు. సమస్యలు పరిష్కరించి న్యాయం చేయడం లేదు’ అంటూ జిల్లాలోని పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు. మూడు నాలుగు సార్లు అర్జీలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కూటమి పాలనలో అర్జీదారుల ఆవేదనపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
180 నుంచి
250 వరకు
చిత్తూరు కలెక్టరేట్ : అర్జీదారులు అలసిపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదో ఒక వారం అధికారులు కనికరించకపోతారా.. అన్న భావనతో నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. కానీ వీరి సమస్యలను ఆలకించి పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోగా.. పాలకులు వాటి గురించి అసలు ఆలోచించకపోవడంతో ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు.
ఏమార్చి.. మోసం చేసి!
క్షేత్ర స్థాయిలో అర్జీదారుల సమస్యలు పరిష్కరించకుండానే ఏమార్చి సంతకాలు చేయించుకుని పరిష్కరించినట్లుగా మోసం చేస్తున్నారు. అర్జీదారులు తిరిగి మళ్లీ ప్రజాసమస్యల పరిష్కార వేదికకు విచ్చేసి అర్జీలందజేస్తున్నారు. కలెక్టర్ దగ్గరకు వెళ్లినా సమస్య నేనే పరిష్కరించాలి అంటూ జిల్లాలోని కొందరు తహసీల్దార్లు అర్జీదారులను భయాందోళలనలకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జీదారులు చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేల అర్జీలు బుట్టదాఖలయ్యాయి.
అంతా కాకిలెక్కలే
జిల్లాలో 2024 జూన్ 15 నుంచి 2025 సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) అధికారిక నివేదికల ప్రకారం 61,100 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో 54,128 అర్జీలు పరిష్కరించినట్లు అధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కనీసం 30 శాతం అర్జీదారులు కూడా కాని పరిస్థితి. ఉన్నతాధికారుల ఒత్తిడిని అధిగమించేందుకు సమస్యలు పరిష్కరించినట్లుగా బోగస్ నివేదికలు సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు. పేద ప్రజల పట్ల కాస్త కూడా కనికరం చూపకుండా జిల్లాలోని క్షేత్రస్థాయి అధికారులు మోసం చేస్తున్నారు. దీంతో అర్జీదారులు కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు.
దారిలేక అవస్థలు
సమస్య ఇలా!
న్యాయం శూన్యం
సమస్య ఇదీ!

అర్జీ ఆవేదన