తల్లులకు ఓపీ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

తల్లులకు ఓపీ పరీక్ష

Sep 2 2025 7:16 AM | Updated on Sep 2 2025 11:28 AM

తల్లులకు ఓపీ పరీక్ష

తల్లులకు ఓపీ పరీక్ష

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి విభాగంలో సోమవారం ఓపీకొచ్చిన తల్లులకు పరీక్ష పెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ కోసం గర్భిణులు, బాలింతలు క్యూకట్టారు. గంటల కొద్దీ క్యూలో నిరీక్షించి నీరసించిపోయారు. ఓపీ ఇచ్చే సిబ్బంది నెమ్మదించడంతో ఈ పరిస్థితి ఎరుదైంది. కనీసం వారికి కూర్చుకోవడానికి కుర్చీలు కూడా చాలినన్ని వేయలేదు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ పరిస్థితి ఎదరువుతోంది. ఆస్పత్రి అధికారులు స్పందించి తల్లులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

10న సంకటహర గణపతి వ్రతం 

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన గణపతి వ్రతం జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి 11గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరగుతుందన్నారు. రాత్రి 7 నుంచి 8గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఉంటుందన్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తుగా టిక్కెట్లు పొందవచ్చని ఆయన సూచించారు.

7న సత్యనారాయణవ్రతం

కాణిపాకం: పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీవరదరాజస్వామి ఆలయంలో సామూహిక శ్రీసత్యనారాయణ వ్రతం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు వ్రతం జరుగుతందన్నారు.

5న జెడ్పీలో గురుపూజోత్సవం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఈనెల 5వ తేదీన విద్యాశాఖ, సమగ్రశిక్షా శాఖల ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధిత ఆయా శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నాయి. ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేసి సత్కరించనున్నట్లు డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement