
తెలుగు సృజనకి ప్రతిరూపం వైఎస్సార్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తెలుగువారి సృజనకి ప్రతిరూపంగా దివంగత ముఖ్యమంత్రి డా వైఎస్.రాజశేఖరరెడ్డి నిలిచారని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షుడు తోట గోవిందన్ కొనియాడారు. మహానేత వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని సమాఖ్య కార్యాలయంలో సోమ వారం సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవిందన్ మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యాల వ్యాప్తికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే అడ్డంకిగా ఉన్నాయన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని, ప్రస్తుత పాలకులు ఆయన్ను ఆదర్శవంతగా తీసుకో వాలని సూచించారు. తెలుగు భాషాభిమానులు కోరుశ్వర మొదలియార్, రాజేంద్రన్, మురళి, ఖాదరు బాషా, నాగరాజు, రఫీ, సునీల్, షఫీ ఉల్లా పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా రథ కలశ ప్రతిష్ట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధివినాయక స్వామి రథానికి సోమవారం శాస్త్రోక్తంగా కలశ ప్రతిష్ట చేశారు. తొలుత ప్రధాన ఆలయంలో రథ కలశం, గొడుగుకు, బ్రహ్మ విగ్రహానికి సంప్రోక్షణ పూజలు చేశారు. కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రథానికి ప్రత్యేక పూజలు చేసి కలశాన్ని ప్రతిష్టించారు. బుధవారం జరగబోయే రథోత్సవానికి ముందు ఇలా ప్రతిష్ట పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఈవో పెంచలకిషోర్ తెలిపారు.

తెలుగు సృజనకి ప్రతిరూపం వైఎస్సార్