సమస్య ఇదీ! | - | Sakshi
Sakshi News home page

సమస్య ఇదీ!

Sep 2 2025 7:16 AM | Updated on Sep 2 2025 7:16 AM

సమస్య ఇదీ!

సమస్య ఇదీ!

ఇప్పటికి మూడు సార్లు అర్జీలు అందజేసినా పుంగనూరు మండలం, మేలందొడ్డి పంచాయతీ, గోపిశెట్టి గ్రామానికి చెందిన గ్రామస్తులకు న్యాయం జరగని దుస్థితి. నివసిస్తున్న ఇళ్లను తొలగిస్తామని చెబుతున్నారని, న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు జూలై 4వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. ఆ తర్వాత మరో రెండు సార్లు మండల స్థాయి అధికారులకు అర్జీ ఇచ్చారు.

మేలందొడ్డి పంచాయతీ, గోపిశెట్టిపల్లిలో సర్వే నం.164/3లో 62 సెంట్లలో శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయ భూములున్నాయి. ఆ భూమి ఉన్న ప్రాంతంలో గోపిశెట్టి గ్రామం ఉంది. దాదాపు వందేళ్ల నుంచే ఆ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లల్లోనే స్థానికులు నివాసముంటున్నారు. ప్రస్తుతం అధికారులు ఇళ్లను తొలగిస్తామని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ సమస్యపై న్యాయం చేయాలని కోరినా ఇంతవరకు స్పందించని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement