
క్రీడాప్రతిభా అవార్డు స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని చిత్తూరు రూరల్ మండలం, సిద్ధంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రీడా ప్రతిభా అవార్డు లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లా స్థాయిలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న పలు పాఠశాలలకు స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భాగంగా క్రీడా ప్రతిభా అవార్డును అందజేశారు. 120 మంది విద్యార్థులు ఉన్న సిద్ధంపల్లి పాఠశాల 115 క్రీడా పాయింట్లతో అవార్డుకు ఎంపికై ంది. ఈ అవార్డును ఆ పాఠశాల పీడీ రవీంద్రారెడ్డి జిల్లా స్థాయిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో డీవైఈవో ఇందిరా చేతుల మీదు గా అందుకున్నారు. ఎంఈవోలు హసన్‌బాషా, సెల్వ పాండ్యన్, హెచ్‌ఎం సురేష్ పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం
యాదమరి: ఇంట్లోని నీటి మోటారు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ వివరాల మేరకు మండల పరిధిలోని నూర్ ఈ నగర్ ప్రాంతానికి చెందిన కలందర్ భార్య ఎస్.అరీఫా(40) ఆదివారం ఉదయం తమ గృహంలో నీటి కోసం మోటారు స్విచ్ వేయగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యం నిమిత్తం చిత్తూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ తెలిపారు.

క్రీడాప్రతిభా అవార్డు స్వీకరణ