
బొలెరో బోల్తా
చౌడేపల్లె : చౌడేపల్లె–పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె సమీపంలో అదుపుతప్పి టమాట లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పరికిదొన నుంచి పలమనేరు మార్కెట్‌కు టమాట కాయ ల బాక్సులను నింపి బొలెరోలో తరలిస్తుండ గా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబో యి వాహనం రోడ్డు పక్కకు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.70 వేల విలువ చే సే టమాట కాయలు నుజ్జునుజ్జయ్యాయి. ధర లు ఆశాజనకంగా ఉన్న సమయంలో ప్రమా దం జరిగి నష్టం వాటిల్లడంతో రైతు బోరున విలపించాడు. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా వారి వివరాలు తెలియ రాలేదు.
విద్యార్థులపై దాడి
– కేసు నమోదు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. గతవారం నాయుడు బిల్డింగ్స్ వద్ద ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్లపైనే బాహాబాహీకి దిగారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఆ రెండు గ్రూపులను స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించి పంపించేశారు. అయితే శుక్రవారం ఓబనపల్లెకు చెందిన హేమంత్‌కుమార్, ధనూష్ అనే విద్యార్థులపై శంకరయ్యగుంటకు చెందిన సతీష్, హర్షద్, వసంత్ అనే ముగ్గురూ దాడికి పాల్పడ్డారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పకడ్బందీగా
డెంగ్యూ మాసోత్సవాలు
తవణంపల్లె: డెంగ్యూ మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి.వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైద్యాధికారులు డాక్టర్ మోహన్‌వేలు, డాక్టర్ కేశవనారాయణ సీహెచ్‌ఓ జ్ఞానశేఖర్, పీహెచ్‌ఎన్ జీవకళ, ఆరోగ్య పర్యవేక్షకులు రాజశేఖర్, రాజామణి, రెడ్డెమ్మ, నిర్మలమ్మ, ఆరోగ్య కార్యకర్తలు సుబ్రమణ్యంరెడ్డి, శ్రీనివాసులు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అప్‌గ్రేడేషన్ పనులు వేగవంతం
చిత్తూరు కలెక్టరేట్ : కుప్పం నియోజకవర్గంలోని 35 మోడల్ స్కూల్స్ అప్‌గ్రేడేషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని 35 మోడల్ స్కూల్స్‌లో పనులను 100 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో 35 ప్రాథమిక పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. అప్‌లోడ్ అయిన ప్రతి బిల్లుకు నగదు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ, ఈఈ మదుసూదన్‌రావు పాల్గొన్నారు.