
ప్లాస్టిక్ నిషేధమే లక్ష్యం
తవణంపల్లె: ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని డ్వామా పీడీ రవికుమార్ పిలుపు నిచ్చారు. స్వచ్ఛ ఆంధ్రా– స్వర్ణాంధ్రా కార్యక్రమంలో భాగంగా పీడీ రవికుమార్ శనివారం తవణంపల్లె హైస్కూల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి ప్రవీణ్, తవణంపల్లె హైస్కూల్ హెచ్‌ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎగువతవణంపల్లె సర్పంచ్ చిట్టెమ్మ, ఏపీడీ బీ.సుబ్రమణ్యం, ఏపీఓ బాల, ఈసీ రమ్య, ప్లాన్‌టేషన్ సూపర్‌వైజర్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.