
నేడు ఐఐటీలో ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం
ఏర్పేడు: మండల కేంద్రంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో గురువారం రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటైన కామన్ ఇంకుబేషన్ సెంటర్‌ను కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రమంత్రి టీజీ భరత్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తొలుత వీరు పర్యటన ఖరారైనప్పటికీ అనివార్య కారణాలతో ఢిల్లీ నుంచే కేంద్రమంత్రి వర్చువల్ విధానంలో ఈ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.2,059 కోట్ల వ్యయంతో 76 కేంద్రాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ఈ యూనిట్‌ను ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభించనున్నారు. ఇక్కడ పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ద్వారా రోజుకు 20 టన్నుల మేరకు మామిడి, టమాట, అంజీర్, జామ తదితర పండ్లను ప్రాసెసింగ్ చేసి జ్యూస్, జామ్, పికిల్స్ వంటి ఉత్పత్తులు స్వస్త్ర బ్రాండ్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.