
‘కాణిపాకం’ను అభివృద్ధి చేయండి
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంను మరింత అభివృద్ధి పరచాలని నేషనలీస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్ అధికార ప్రతినిధి, యువ భారత్ చైర్మన్ వైద్య ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఈఓ క్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సన్మానం చేశారు. కాణిపాకం అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా దేవస్థాన అధికారులు అడుగులు వేయాలని ఈవోను కోరారు.
రేపటితో ముగియనున్న
వెబ్ ఆప్షన్లు
తిరుపతి సిటీ : ఏపీఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఈనెల 13వ తేదీ నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటికే జిల్లాలో సుమారు 19 వేల మందికిపైగా వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మరో రోజు మాత్రమే వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఉండడంతో విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 19వ తేదీన ఒక రోజు మాత్రమే వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉండనుంది. 22 వతేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే ఐసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఈనెల 21వ తేదీవరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇచ్చిన అధికారులు, 22న వెబ్ ఆప్షన్ల మార్పు, 25న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.