మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం

Jul 17 2025 3:34 AM | Updated on Jul 17 2025 3:34 AM

మాతా

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం

ఉజ్వల భవితకు నవోదయం
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు
● అరెస్టు చేసిన ప్రతి కార్యకర్తకు అండగా జగనన్న ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
● పలు శాఖల అధికారులతో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సమీక్ష

పుష్ప పల్లకిలో పురుషోత్తముడు

తిరుమలలో బుధవారం శ్రీవారు ఉభయ దేవేరులతో పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

చిత్తూరు కలెక్టరేట్‌ : అర్హత ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది విద్యార్థులకు తల్లికి వందనం మొదటి, రెండు విడతల్లో సాయం అందని దుస్థితి. ఇదేమిటని ఆరాతీస్తే ఆధార్‌ అప్‌డేట్‌ (ఈకేవైసీ) జరగలేదనే కారణం తెలియవచ్చింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఆధార్‌ కేంద్రాలు, సచివాలయాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. మరికొంత మంది సచివాలయాలు, ఆధార్‌ కేంద్రాల వద్దకు తిరిగి ఆధార్‌ అప్‌డేట్‌ అవ్వక దూరమైన పరిస్థితి. ఇదే విధంగా పలు సంక్షేమ పథకాలకు అర్హులైనప్పటికీ వేల మంది లబ్ధిదారులు ఆధార్‌ సమస్యతో నష్టపోతున్నారు. ఆధార్‌ సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అప్‌డేట్‌ చేయించకపోవడం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆధార్‌ తప్పనిసరిగా మారింది. కొత్తగా ఆధార్‌ పొందడంతో పాటు ఎప్పుడో పొందిన ఆధార్‌ను అప్‌డేట్‌ (ఈకేవైసీ) చేయించుకోకపోవడం వల్ల లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. దీంతో అర్హత ఉన్నా సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. మ్యాన్‌డేటరీ బయోమెట్రిక్‌ అప్‌డేట్స్‌ (ఎంబీయూ) చేయించుకోని వారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఆధార్‌కార్డు ఉన్నప్పటికీ అప్‌డేట్‌ చేయించుకోకపోవడంతో సంక్షేమ పథకాలు పొందలేని దుస్థితి ఏర్పడుతోంది.

అవగాహన కల్పించక..

శిబిరాల నిర్వహణ తెలియక

జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్‌ నమోదు శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆ శిబిరాలు ఎప్పుడు నిర్వహిస్తారో...ఎప్పుడు ముగిస్తారో అనే వివరాలు ఎవ్వరికీ తెలియని దుస్థితి. ఆధార్‌ శిబిరాల్లో ఏ సేవలు పొందవచ్చనే అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు. పిల్లలైతే తల్లి లేదా తండ్రిని తీసుకుని, పెద్దలైతే స్వయంగా ఆధార్‌తో వెళ్లి వేలిముద్రలు వేస్తే అప్‌డేట్‌ ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి ఎటువంటి రుసుం వసూలు చేయరు. కొత్తగా ఆధార్‌ పొందేవారి నుంచి మాత్రం నిర్ణీత రుసుం వసూలు చేస్తారు. తదితర అంశాలను, ఆధార్‌ శిబిరాల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడితే అర్హులకు న్యాయం జరుగుతుంది.

విధుల్లో చేరని

వీఆర్‌ఓలపై కఠిన చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌ : బదిలీ అయిన వీఆర్‌ఓలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వీఆర్‌వోలను ఇటీవల భారీ స్థాయిలో బదిలీలు నిర్వహించిన విషయం విధితమే. ఈ బదిలీలు జరిగి దాదాపు నెల రోజులు అవుతోంది. అయితే పలు ప్రాంతాల్లో బదిలీ అయిన వీఆర్‌ఓలు ఇప్పటికీ కొత్త స్థానాల్లో విధుల్లో చేరని పరిస్థితి ఉంది. ఈ విషయం పై ఉన్నతాధికారులకు తహసీల్దార్లు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌ బదిలీ అయిన వీఆర్‌ఓలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని బుధవారం ఆదేశించారు. రెండు రోజుల్లో కొత్త స్థానాల్లో తప్పనిసరిగా చేరాలని, లేని పక్షంలో కఠిన చర్యలుంటాయని డీఆర్‌వో హెచ్చరించారు.

వైద్య బిల్లుల చెల్లింపులో జాప్యం తగదు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల వైద్య ఖర్చుల బిల్లుల చెల్లింపులో జాప్యం వహించడం సరికాదని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌ రెడ్డి శేఖర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ గుర్తింపు లేని ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేసుకున్న ఉద్యోగులు, టీచర్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారన్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లో ముందస్తుగా ఖర్చులు పెట్టి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. వెంటనే రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తూతూ మంత్రంగా తనిఖీ

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరులోని మిట్టూరులోని అరుణాచల జూనియర్‌ కళాశాలలో రెండు రోజులుగా ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంలకు నిపుణ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ జారీచేసిన నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా మమ అనిపించేస్తున్నారు. ఈ శిక్షణ ప్రారంభమై న మొదటి రోజే హాజరైన ప్రైమరీ హెచ్‌ఎంలకు భోజనం పెట్టకపోవడంతో ధర్నా చేయాల్సి వ చ్చింది. దీంతో జిల్లా సమగ్రశిక్ష శాఖ అధికారుల అలసత్వ ధోరణిపై పలు ఫిర్యాదులు రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ మేరకు ఎస్‌ఐఎంఏటీ (స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌ మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌) శాఖ డైరెక్టర్‌ మస్తానయ్య బుధవారం ఆకస్మికంగా జిల్లా పర్యటనకు విచ్చేశారు. అరుణాచల జూనియర్‌ కళాశాల శిక్షణా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ కేంద్రంలోని ఐదు గదులలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అ యితే ఆయన ఐదు నిమిషాలు సైతం కేంద్రంలో ఉండకుండా ఏదో వచ్చామా....వెళ్లామా అనే ధో రణిలో పరిశీలించి వెళ్లిపోయారు. ఈ అంశం శిక్షణా కేంద్రంలో సర్వత్రా చర్చగా మారింది. ఇలాంటి మొక్కుబడి తనిఖీలతో ఎవరికి ఉపయోగమని సంఘం నేతలు పెదవి విరుస్తున్నారు.

కార్వేటినగరం : అక్రమ కేసులకు, కూటమి నాయకుల తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని నియోజకవర్గ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి జగనన్నతో మాట్లాడుతూ.. బంగారు పాళ్యం మార్కెట్‌ యార్డులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించారని జగనన్నకు వివరించినట్లు తెలిపారు. కూటమి నాయకులు కక్ష కట్టి కేసులు పెట్టిన ప్రతి కార్యకర్తకూ జగనన్న అండగా ఉంటారని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని చెప్పారన్నారు. అక్రమ కేసులో అరెస్టు అయిన వారికి న్యాయ సలహా ద్వారా రక్షణ కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు జగనన్న సూచించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పాలసముద్రం మండలం నుంచి కూటమి నాయకులు యథేచ్ఛగా దోచుకుంటున్న గ్రావెల్‌ మాఫియాపై జగన్‌ మోహన్‌రెడ్డికి వివరించినట్లు తెలిపారు. వారి వెంట ఉమ్మడి జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గం బూత్‌ కమిటీ కన్వీనర్‌ నారాయణరెడ్డి పలువురు ఉన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ..ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు బాధ్యతాయుతంగా పనిచేసేలా మెడికల్‌ ఆఫీసర్లు పర్యవేక్షించాలని తెలిపారు. గర్భిణుల నమోదులో అలసత్వం చోటు చేసుకోకుండా అంగన్‌వాడీ కేంద్రాలల్లోని రిజిస్టర్‌తో సరిచూసుకోవాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌వో సుధారాణి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్‌, డీఐవో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

నిరక్షరాస్యులకు ‘ఉల్లాస్‌’

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్‌ పథకంలో అక్షర ఆంధ్రా ను ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ అన్నారు. ఈ పథకం అమలు పై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. జిల్లాలో దాదాపు 40 వేల నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 2029 నాటికి 100 శాతం అక్షరాస్యత దిశగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పడేల్‌, జెడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

పథకాలకు దూరమవుతున్న లబ్ధిదారులు

అవగాహన లేక నష్టపోతున్న ప్రజలు

క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం

లబ్ధిదారులకు న్యాయం జరిగేదెప్పుడు?

ఆధార్‌ అప్‌డేట్‌ లేకపోతే..ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్‌ నుంచి పింఛన్‌ వరకు ఏ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులు ఆధార్‌ సమస్యలతో సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. ఆధార్‌ సమస్యలను పరిష్కరించాల్సిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఎంత మంది సంక్షేమ పథకాలకు దూరమైతే అంత మంచిదనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు దూరమైన లబ్ధిదారులకు ఎవరు న్యాయం చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో సమస్యగా మారిన ఆధార్‌ సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

జిల్లాలో ఆధార్‌ అప్‌డేట్‌ సమస్యల వివరాలు ఇలా..

5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు 21,456

15 ఏళ్లకు పైబడిన వారు 1,45,258

తల్లికి వందనం పథకంలో

నష్టపోయిన విద్యార్థులు దాదాపు 3 వేల మంది

ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సిన

విద్యార్థులు 1,326 మంది

ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సిన

పెద్దలు 4,879 మంది

సంక్షేమ పథకాలకు దూరం

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆధార్‌ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్‌ ముఖ్యం చేయడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. అవగాహన ఉన్న ప్రజలేమో కేంద్రాలకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటున్నారు. అవగాహన లేని వృద్ధులు అవస్థలు పడుతున్నారు. అదే విధంగా చాలా మంది పిల్లలకు ఆధార్‌ కార్డులు లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆధార్‌ అప్‌డేట్‌ అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ప్రజలకు న్యాయం చేయాలి.

– వాడ గంగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు, చిత్తూరు జిల్లా

సమస్యలు ఇలా..

చిత్తూరుకు చెందిన బాలుడు అజిత్‌ను ఒకటో తరగతిలో చేర్చేందుకు వారి తల్లిదండ్రులు వెళ్లారు. ఆధార్‌ లేకపోవడంతో చైల్డ్‌ ఇన్‌ఫోలో వివరాలు నమోదు కాలేదు. దీంతో తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాలో ఆ విద్యార్థి పేరు చేరలేదు. ఇదే సమస్యతో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులుగా జూన్‌ 30వ తేదీ లోగా ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకున్న రైతులనే ఎంపిక చేశారు. ఈకేవైసీ, ఆధార్‌ అప్‌డేట్‌ లేక వేల మంది రైతులు అర్హుల జాబితాలో చేరలేక నష్టపోయారు. ఫలితంగా నష్టపోయిన రైతులు నిత్యం రైతు సేవా కేంద్రాలు, సచివాలయాలు, ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 1947 ప్రాథమిక, 158 ప్రాథమికోన్నత, 153 ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు పొందిన వారిలో దాదాపు 3 వేల మంది విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, విద్యా సామగ్రిని పొందలేకపోయారు.

జిల్లాలోని వసతి గృహాల్లో అడ్మిషన్లు పొందిన దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఆధార్‌ సమస్యతో అవస్థలు పడుతున్నారు.

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం 1
1/5

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం 2
2/5

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం 3
3/5

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం 4
4/5

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం 5
5/5

మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement