
వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేద్దాం
బంగారుపాళెం: మామిడి రైతులకు అండగా నిలిచేందుకు మండలానికి విచ్చేయనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. మండలంలోని పాలేరు గ్రామంలో ఆదివారం సాయంత్రం మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సునీల్‌కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 9న మామిడి మార్కెట్‌ను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నారని చెప్పారు. ధరలు లేక తోటల్లో కాయలు నేలరాలిపోతుంటే రైతులు కంట తడి పెట్టుకున్నట్లు తెలిపారు. మామిడి రైతులు పడుతున్న కష్టాలు కూటమి నాయకులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సర్దార్, జిల్లా పార్టీ కార్యదర్శులు గోవిందరాజులు, ప్రకాష్‌రెడ్డి, వడ్డెర, ఈడిగ కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్లు మొగిలీశ్వర్, ఎల్లప్ప, నియోజవర్గ రైతు విభాగం అధ్యక్షులు పాలాక్షిరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షులు అరుణామల్‌రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షాకీర్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వాణీప్రియ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు మాలతి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.