
కూలిన విద్యుత్ దీప స్తంభం
చిత్తూరు అర్బన్: నగరంలోని గాంధీ రోడ్డు కూడలిలో అర్ధరాత్రి విద్యుత్ దీపస్తంభం కుప్పకూలింది. శనివారం అర్ధరాత్రి తరువాత ఓ లారీ వేగంగా వచ్చి దాదాపు వంద అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ దీప స్తంభాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ఆ స్తంభం రోడ్డుపైనే కూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
జంతువులకు
వ్యాధి నిరోధక టీకాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జంతువుల నుంచి మనుషులకు సోకే రేబిస్ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ జేడీ అబ్దుల్ ఆరీఫ్ తెలిపారు. జూనోసిస్ డేను పురస్కరించుకుని ఆదివారం స్థానిక పశువైద్యశాలలో శునకాలకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జంతువులు, పక్షుల నుంచి మనుషులకు 280 రకాల వ్యాధులు వ్యాపించే వీలుందని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జూనోసిన్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పశువైద్య శాలల్లో 23,440 ఉచిత డోస్‌ల టీకాలు శునకాలకు వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,942 డోసుల టీకాలు వేశామన్నారు. ఉచిత టీకాల ప్రక్రియ స్టాక్ ఉన్నంత వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఓ లోకేష్, పశువైద్యాధికారిణి సుబ్బమ్మ పాల్గొన్నారు.

కూలిన విద్యుత్ దీప స్తంభం