మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర | - | Sakshi
Sakshi News home page

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

Jul 1 2025 4:05 AM | Updated on Jul 1 2025 4:05 AM

మామిడ

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

● ఫ్యాక్టరీ యజమానులతో కూటమి నేతల కుమ్మక్కు ● కడుపు మండి.. రైతుల ఆందోళన ● రైతుల దృష్టిని మరల్చేందుకు పెద్దిరెడ్డిపై నిందలు

కూటమి సర్కారు దొంగాట ఆడుతూ మామిడి రైతులను నిండా ముంచేసింది. దొంగచాటుగా అధికార పార్టీ నేతల సిఫార్సులకు టోకెన్లు ఇచ్చి సామాన్య రైతులను పక్కన పెట్టేసింది. దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై మామిడి రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న మామిడి చెట్లను నిలువునా నరికేసుకుంటున్నారు. ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో మామిడి కాయలను రోడ్లపై పారబోస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నా, కనికరించే నాథుడు కరువయ్యారు. కాయలు అమ్ముకోవడానికి రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా నిరీక్షించిన రైతులు కడుపు మండి ధర్నాకు దిగుతున్నారు. ఈ పరిణామాల నుంచి రైతులు, ప్రజల దృష్టిని మరల్చడానికి కూటమి నేతలు, ఎల్లో మీడియాతో కలిసి వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. రెండు రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం ప్రారంభించారు.

గుడిపాల మండలం గొల్ల మడుగు వద్ద..

క్యూ కట్టిన మామిడి కాయల వాహనాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొద్ది రోజులుగా మామిడి రైతుల అవస్థలు వర్ణనా తీతంగా ఉన్నాయి. ప్రభుత్వం మొదట్లో మామిడి కిలో రూ.12గా ప్రకటించింది. ఆ తరువాత రూ.8 అని చెప్పింది. ఇంకో రోజు రూ.6 అని, ఆ తరువాత రూ.5 అని ఇష్టానుసారంగా రోజుకొక ధర చెబుతూ రైతులను మభ్యపెడుతూ వస్తోంది. ధర లేకపోతే పోనీ ఏదో ఒక రేటుకు కాయలు విక్రయించేస్తామన్న రైతులకు టోకెన్లు ఇవ్వడం లేదు. దానికి టీడీపీ నేతల సిఫార్సులు కావాలి. దీంతో పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. మరి కొందరు రైతులు మామిడి కాయల లోడ్లను తీసుకొచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా వరకు కాయలన్నీ ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి.

తెల్ల కాగితాలపై సంతకాలు

రైతులు పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని కాయలు దించుకుని పంపేస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులు ధర్నాలకు దిగుతున్నారు. గంగాధరనెల్లూరు వద్ద ఓ ఫ్యాక్టరీ యజమాని, అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క దొంగచాటుగా వారికి అనుకూలంగా ఉన్న వారి కాయలను మాత్రం దించుకోవడాన్ని మామిడి రైతులు గమనించారు. వారి తీరుని నిరసిస్తూ ఆదివారం రోడ్డుపై వాహనాలతో మెరుపు ధర్నా చేపట్టారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ కూటమి నేతలు వారి దృష్టిని మరల్చేందుకు వైఎస్సార్‌సీపీపై బురద జల్లడం ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ నేతలే కొందరిని రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి ప్రచారం చేస్తున్నారు.

ఇంత దిగజారుడుతనమా?

రైతులను ఆదుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా దిగుజారుడు రాజకీయాలకు దిగడం దారుణం. మామిడి దిగుబడులకు మద్దతు ధర కల్పించలేక, రోజుల తరబడి క్యూలో ఉన్న మామిడిని కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ యజమానులు, కూటమి నేతలు కుమ్మకై ్క మామిడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వ తీరుని గమనిస్తున్న మామిడి రైతులు తిరగబడుతున్నారు. దీని నుంచి రైతుల దృష్టిని మరల్చటానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్న దిగజారుడు తనం మరొకటి లేదు, ఉండబోదు.

– భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు

అడుగడుగునా దగా..

● ఒక ట్రాక్టర్‌ కాయలు ఫ్యాక్టరీల వద్ద అన్‌లోడ్‌ చేయడానికి 3 రోజుల నుంచి వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. అదే కూటమి నేతలు, అధికారులకు తెలిసిన వారి ట్రాక్టర్లు దొంగ చాటుగా ఒక్క రోజులోనే అన్‌లోడింగ్‌ చేసి పంపేస్తున్నారు.

● ప్రస్తుతం ఒక్కో జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద సుమారు 3 కిలోమీటర్ల దూరం మేర మామిడి కాయల ట్రాక్టర్లు క్యూ కట్టి ఉన్నాయి.

● దీని వల్ల ఒక ట్రాక్టర్‌లో 5 టన్నుల కాయలతో వస్తే అన్‌లోడ్‌ చేసే నాటికి దాదాపు 1.5 టన్ను కాయలు పాడైపోతున్నాయి.

● ఫ్యాక్టరీ యాజమాన్యాలు ట్రాక్టర్ల అన్‌లోడింగ్‌ కోసం రోజుకు 100 టోకెన్లు ఇస్తామని చెబుతున్నా కేవలం 50 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు.

● అన్‌లోడింగ్‌ చేసుకుని ఎన్ని టన్నులు దించుకున్నామంటూ రైతులకు బిల్లులు ఇస్తున్నారు. అయితే ఆ బిల్లులో కిలో మామిడి ధర ఎంతో స్పష్టం చేయలేదు.

● దీనిపై రైతుల నుంచి తిరుగుబాటు రాకుండా అంగీకార పత్రంపై రైతు వద్ద నుంచి సంతకం తీసుకుని పంపుతున్నారు.

● దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తర్వాత ఎంత ధర చెల్లించినా రైతులు ప్రశ్నించే అవకాశం లేదు.

● ఒక ట్రాక్టర్‌కు లోడ్‌ చేసే మామిడి కాయలు కోయడానికి రైతుకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. బాడుగ (ఐదు రోజులకు) రూ.7 వేలు.

● ఒకవేళ ఐదు రోజుల్లోపు ఫ్యాక్టరీ యాజమాన్యం కాయాలను దించుకోకుంటే, ఐదో రోజు తర్వాత మళ్లీ అదనంగా రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు రైతు అదనంగా బాడుగ చెల్లించాలి.

● టీడీపీ కూటమి నాయకులు సిఫారసు చేసిన రైతుకు చెందిన మామిడి కాయల ట్రాక్టర్లను రాత్రి వేళ ఫ్యాక్టరీలోకి పంపి అన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి రోడ్లపైన వేచి ఉండలేక కొందరు రోడ్డుపైనే కింద పారబోసి వెళ్లిపోతున్నారు.

● ప్రభుత్వం మామిడి కాయలను రైతు నుంచి ఒక కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు 8 రూపాయల లెక్కన ఎక్కడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం

● ర్యాంపుల వద్ద కిలో మామిడి కేవలం రెండు రూపాయలుగా మాత్రమే నిర్ణయించారు. చేసేది లేక రైతులు రూ.2కే అమ్ముకోవాల్సిన దుస్థితి కలిగింది.

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర 
1
1/6

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర 
2
2/6

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర 
3
3/6

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర 
4
4/6

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర 
5
5/6

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర 
6
6/6

మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement