
యూడైస్‌లో కచ్చితమైన వివరాలుండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో యూడైస్ నివేదికలను కచ్చితమైన వివరాలతో నమోదు చేయాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో శ్రీనివాసులు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌తో మిట్టూరులోని ఆర్‌కే జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు హొలి స్టిక్ ప్రోగ్రెస్ కార్డులను మెగా పేరెంట్స్, టీచర్ సమావేశం రోజును పంపిణీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న మెగా పీటీఎం సమావేశాలను నిర్వహించాలని తెలిపారు. మూడు నెలల పాటు చిత్తూరు జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవోగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన డీఐఈఓ శ్రీనివాసులును ప్రిన్సిపల్స్ దుశ్శాలువతో సత్కరించారు.