
ఇష్టారాజ్యంగా ఎంఎస్‌కే బదిలీల కౌన్సెలింగ
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల (ఎంఎస్‌కే) బదిలీ కౌన్సెలింగ్‌లో అదే గందరగోళం నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు సోమవారం కూడా చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 600 మందికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. సాయంత్రం 6 గంటలకు సంగం మందికి మాత్రమే కౌన్సెలింగ్ పూర్తయ్యింది. అయితే కౌన్సెలింగ్ సక్రమంగా నిర్వహించడంలేదని, సిఫార్సులు ఉన్న వాళ్లకు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగులు ఇస్తున్నారంటూ పలువురు ఎంఎస్‌కేలు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకటాద్రి, ఇతర అధికారులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు మెజారిటీ ఉద్యోగులు తిరుపతి అర్బన్, చిత్తూరు అర్బన్ ప్రాంతాలనే కోరుకోవడం.. అక్కడ ఖాళీలు లేకపోవడం, కుప్పంలో 50కు పైగా పోస్టులు ఖాళీ ఏర్పడడంతో ఎవర్ని నియమించాలో తెలియక అధికారులు సైతం ఒకింత గందరగోళానికి గురయ్యారు.
సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటించే ప్రాంతాలను సోమవారం ఆయన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తుమ్మిశి వద్ద హెలీప్యాడ్, తులసినాయనపల్లి వద్ద బహిరంగ సభా వేదిక, మోడల్ స్కూలు, తిమ్మరాజుపల్లితోపాటు కడపల్లి వద్ద సీఎం నివాసాలను సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సీఎం పర్యటన ముగిసే వరకూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. బారికేడ్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలలో ఎక్కడికక్కడ చేయాల్సిన పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాల్లో సీఎంవో అధికారులు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీపీవో ప్రభాకర్, ఆర్డీవో శ్రీనివాసులురాజు, అదనపు ఎస్పీ నందకిశోర్, డీఎస్పీలు రాజ్‌నాథ్, సాయినాథ్, ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ శివయ్య పాల్గొన్నారు.
నేడు చంద్రబాబు కుప్పం రాక
కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళ, బుధ వారాల్లో కుప్పంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం శాంతిపురం మండలం, కడపల్లె వద్ద ఆయన సొంతింటికి చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం శాంతిపురం మండలం, తిమ్మరాజుపల్లిలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం తుమ్మిశి వద్ద ఉన్న మోడల్ పాఠశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం కుప్పం వంద పడకల ఆస్పత్రిలో టాటా సంస్థతో ఒప్పందం కుదర్చుకున్న డీఎన్‌సీ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం తుమ్మిశి వద్దనున్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుని తిరుగుప్రయాణమవుతారు.
‘సమగ్ర’ంగా బదిలీల కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్ష శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆ శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ ఆధ్వ ర్యంలో సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి పో స్టింగ్‌లు ఇచ్చారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లా లోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న సీఆర్‌పీ, పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్, కేజీబీవీ సిబ్బందికి రిక్వెస్ట్ బదిలీలు నిర్వహించాలన్నారు. సీనియారిటీ జాబితా ఆధారంగా బదిలీలకు 26 మంది దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 17 మంది బది లీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారన్నారు. ఐదు గురు అన్ విల్లింగ్ ఇవ్వగా, ఇద్దరు గైర్హాజరైన ట్లు చెప్పారు. అంతర్ జిల్లా బదిలీలకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారని, వారికి రాష్ట్ర స మగ్రశిక్ష కార్యాలయంలో బదిలీలు నిర్వహిస్తారన్నారు. సెక్టోరల్ అధికారులు ఇంద్రాణి, శశిధర్, సూపరింటెండెంట్ కుమార్ పాల్గొన్నారు.

ఇష్టారాజ్యంగా ఎంఎస్‌కే బదిలీల కౌన్సెలింగ