
బాబు హామీలు రీ–కాల్!
డీఐఈఓ శ్రీనివాసులును సత్కరిస్తున్న ప్రిన్సిపాళ్లు
చిత్తూరు అర్బన్: ‘చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునుపు ప్రజలపై హా మీల వరాలు గుప్పించారు. అప్పటి వరకు సీఎంగా ఉన్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలతో పాటు మరో 143 పథకాలు అమలు చేస్తామని, సూపర్‌సిక్స్ పేరిట ఇంకో ఆరు పథకాలు ఇస్తా మని ఊదరగొట్టారు. కానీ సీఎం అయ్యాక ఏడాది పాలనలో ఒక్కటీ అమలు చేయలేదు. అందుకే చంద్రబాబునాయుడు ఇచ్చి న అబద్ధపు హామీలను వివరిస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో (తప్పుడు హామీలు ప్రజలకు గుర్తు చేయడం)’ పేరిట ప్రజల్లో చైతన్యం కల్పిద్దాం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మిన ప్రజలు.. కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మోసపోయారన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ, ఇదే సమయంలో వైఎస్.జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు జరిగిన మేలును వివరించడానికి గ్రామా లు, పట్టణాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నడుం బిగించాలన్నారు. సోమవారం చిత్తూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డితో కలిసి ఆయన పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు రూ.2.85 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్టు గుర్తుచేశారు. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి నేతలు ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారన్నారు. హామీలు అమలు చేయకపోగా.. వైఎస్సార్‌సీపీ నేత లు, కార్యకర్తలను హతమార్చడం, దాడు లు చేయడం, విధ్వంసాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి బాధ్యతలను గుర్తుచేసినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్‌తో బాబు తప్పించుకుంటున్నారన్నారు. తల్లికి వందనం కింద 80 లక్షల మంది లబ్ధిదారులకు నిధులు ఎగ్గొట్టారని, 5 లక్షల మంది రేషన్‌కార్డులు తొలగించారని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి లాంటి పథకాల ఊసే ఎత్తలేదన్నారు. వీటన్నింటినీ ఇంటింటికీ నయవంచన పేరిట వివరిస్తామన్నారు.
149 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చ లేదు
ఆ హామీల విలువ రూ.75 వేల కోట్లు
ప్రతీ గడప మెట్లెక్కి.. అబద్ధపు హామీలను వివరిద్దాం
చిత్తూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరెడ్డి
మామిడికి మద్దతు ధర ఏదీ?
విజయానందరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం చేస్తున్నారన్నారు. చిత్తూరు చరిత్రలో మామిడి రైతులు పడుతున్న పాట్లు గతంలో ఎన్నడూ లేవన్నారు. మామిడికి కనీస ధరను అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఫ్యాక్టరీల వద్ద పర్మిట్లను టీడీపీ నేతల చేతుల్లో పెట్టుకుని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. మామిడి రైతుల బాధలు ఆలకించడానికి తమ నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జిల్లాకు రానున్నట్టు చెప్పారు. కూటమి నేతలు ప్రతి ఇంటికీ మంజూరు చేసిన అబద్ధపు బాండ్లను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేతలు పెడుతున్న తప్పుడు కేసులను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, ఏ ఒక్క పార్టీ కార్యకర్త భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ చిత్తూరు నగర అధ్యక్షులు కేపీ.శ్రీధర్, హరిణిరెడ్డి, నాయకులు గాయత్రీదేవి, లీనారెడ్డి, ప్రకాష్, జ్ఞాన జగదీష్, ప్రసాద్‌రెడ్డి, విజయసింహారెడ్డి పాల్గొన్నారు.

బాబు హామీలు రీ–కాల్!