ఇంత నీచ రాజకీయం తగదు బాబూ..
పుంగనూరు(చౌడేపల్లె): ఇలాంటి నీచ రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప అన్నారు. ఆయన సోమవారం పుంగనూరులో పార్టీ నాయకులతో కలిసి జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, మహిళలకు రక్షణలేదని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలీం బాషా, రాష్ట్ర జానపద కళల మాజీ చైర్మన్ కొండేటి నాగభూషణం, రాయలసీమ మైనారిటీ విభాగం నాయకుడు ఫకృద్దీన్ షరీఫ్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు అమరనాథరెడ్డి, ఇర్ఫాన్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
భక్తులు సంతృప్తి చెందేలా చర్యలు
చౌడేపల్లె: ఆలయాలకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా దైవ దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ రాష్ట్ర కమి షనర్ రామచంద్రమోహన్ తెలిపారు.షాయన సోమవారం బోయకొండలో పర్యటించగా, ఈఓ ఏకాంబరం స్వాగతం పలికారు. ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు అందుతున్న సేవలు, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంయుక్త కమిషనరేట్ పరిధిలో ఉన్న 7 ఆలయాలు, ఉపకమిషనరేట్ పరిధిలో ఉన్న 17 ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు.
ఇంత నీచ రాజకీయం తగదు బాబూ..


