
అకాలవర్షం.. అపారనష్టం
చిత్తూరు రూరల్ : జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాలవర్షం అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులు పలు రకాల పంటలను దెబ్బతీసింది. దీని దాటికి పలు చోట్ల మామిడికి అపార నష్టం వాటిల్లింది. చెట్లు నేలవాలడంతో పాటు మామిడి కాయలు మొత్తం నేలరాలాయి. అలాగే అరటి, బొప్పాయి, కొబ్బరి పంటలు కూడా నష్టాన్ని మిగిల్చా యి. ఈ సమాచారం అందుకున్న ఉద్యానశాఖ అధికారులు శనివారం పంట పరిశీలనలో పడ్డారు. 7 మండలాల పరిధిలో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అధికంగా మామిడి పంట నష్టపోయినట్లు అంచనా వేశారు. మామిడితో పాటు పలు రకాల పంటలు మొత్తం 171.46 హెక్టార్లల్లో పంట దెబ్బతింటే 404 రైతులు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. పెనుమూరు మండలంలో మామిడి 12 హెక్టార్లు, యాదమరిలో అరటి ఒక హెక్టారు, మామిడి 5 హెక్టార్లు, చిత్తూరులో అరటి 0.8 హెక్టార్లు, బొప్పాయి 0.4 హెక్టార్లు, మామిడి 54 హెక్టార్లు, కొబ్బరి 0.06 హెక్టార్లు, గుడిపాలలో అరటి 1.6 హెక్టార్లు, బొప్పా యి 0.4 హెక్టార్లు, మామిడి 25 హెక్టార్లు, పలమనేరు లో 39 హెక్టార్లు, తవణంపల్లిలో మామిడి 22.2 హెక్టా ర్లు, ఐరాలలో మామిడి 10 హెక్టార్లల్లో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో గాలీవాన బీభత్సంతో
దెబ్బతిన్న పంటలు
అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్న మామిడి
171.46 హెక్టార్లలో పండ్లతోటల
నష్టం గుర్తింపు
నష్టం మరింత పెరిగే అవకాశం

అకాలవర్షం.. అపారనష్టం

అకాలవర్షం.. అపారనష్టం