పురాతన వస్తువులు..నేడు అలంకారప్రాయం.. ఇళ్లలో అలంకరణకు పరిమితం.. ఇదీ నేటి పరిస్థితి. అయితే కాలం మారినా.. ఆధునిక వస్తువులు అందుబాటులోకి వచ్చినా నేటికీ కొంతమంది అలనాటి జ్ఞాపకాలతో విడదీయలేని అనుబంధం పెంచుకున్నారు. వాటిని ఇప్పటికీ వినియోగిస్తూ ఆనందం పొందుతున్నారు. అపురూపంగా భావిస్తున్నారు. అలాంటి వారిపై ఆదివారం ప్రత్యేకం.
ఐరాల: మన చిరుప్రాయంలో చూసిన వస్తువులు నేడు అలంకార వస్తువులుగా మారాయి. పాత కాలపు చేతి గడియారాలు, రేడియోలు, ల్యాండ్ ఫోన్‌లు, ఉత్తరాలు, టేప్‌రికార్డర్ ఇళ్లలోని కబోర్డు ల్లో బొమ్ములుగా దర్శనమిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల సునామీలో ఎన్నో వస్తువులు కొట్టుకుపోయాయి. వాటిని ఇప్పుడు మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు పాటలు వినాలనిపించినా, ఏదైనా సమాచారం కోసమైనా, టైమ్ చూడాలన్నా మన కళ్లు సెల్‌ఫోన్‌ను వెతుకుతున్నాయి. దీంతో అలనాటి వస్తువులు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కానీ ఇప్పటికీ మండల కేంద్రంలో కొంతమంది టెప్ రికార్డులు, పోర్టబుల్ టీవీలు వాడుతున్నారంటే విశేషం.
ఇప్పటికీ పోర్ట్‌బుల్ టీవీ చూస్తున్నాం
అలనాటి జ్ఞాపకాలు..
మరపురాని గుర్తులు
రేడియో, టేపు రికార్టర్ ఉన్నా వినేవారు కరువు
అలంకారప్రాయంగా మారిన
చేతి గడియారాలు
ఉత్తరాలు, టార్చ్‌లైట్, టెలిఫోన్‌ను
తొక్కేసిన స్మార్ట్‌ఫోన్లు
నా జీవన శైలిలో టేప్ రికార్డర్ ముఖ్యభాగం
నా జీవన శైలిలో టేప్‌రికార్డర్ ముఖ్య భాగం అయిపోయింది. మా కుటుంబ సభ్యులతో కలిసి 1990వ సంవత్సరంలో టేప్‌రికార్డర్ (ఫిలిప్స్) రూ.2 వేలు ఇచ్చి కొనుకున్నాం. అందులోనే రేడియో అందుబాటులో ఉండేది. ఆ టేప్‌రికార్డర్, రేడియోతో నాకు గొప్ప అనుబంధం ఏర్పడింది. రేడియో ఎఫ్‌ఎం ద్వారా ఉదయం పూట భక్తిగీతాలు, మధ్యాహ్నం నుంచి హిందీ సినిమా పాత పాటలు. ప్రతి బుధవారం బహుళప్రాచుర్యం పొందిన బినాకా గీతమాల కార్యక్రమం గొప్ప ఆసక్తితో వినేదాని. ఇక మన ఆకాశవాణికి సంబంధించి తెలుగు కార్యక్రమాలను బాగా వినేదాని. టేప్‌రికార్డర్‌లో క్యాసెట్‌లు ద్వారా పాత తెలుగు సినిమా పాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేది. సినిమాలు వినడానికి ఆదివారం కోసం ఎదురుచూసే వాళ్లం. ఈ సినిమాలు వింటే ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న భావన కలిగేది. ప్రస్తుతం టేప్‌రికార్డర్ పాడైపోవడంతో 98.3 ఎఫ్‌ఎం ద్వారా రేడియోలో వచ్చే హిందీ పాటలు, తెలుగు జానపద గేయాలు, హరికథ, బుర్రకథలు వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఆకాశవాణి విజయవాడ ఎఫ్‌ఎం కేంద్రం రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటలవరకూ ప్రసారం చేసే పాత తెలుగు సినీ గీతాలు తప్పక విని ఆ తర్వాతనే నిద్రకు ఉపక్రమించడం నా జీవన శైలిలో ఒక ముఖ్య భాగం అయిపోయింది.
– సరోజమ్మ, వీఎస్.అగ్రహారం, ఐరాల
మా కుటుంబ సభ్యులు ఇప్పటికీ పోర్ట్‌బుల్ టీవీ వీక్షిస్తున్నాం. మేము 18 సంవత్సరాల క్రితం ఈ టీవీని రూ.3వేలు ఇచ్చి కొనుగోలు చేసాం. ఇప్పటికీ టీవీ బాగా పనిచేస్తున్నాది. కాకపోతే ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు రిపేర్ అవుతున్నాది. మెకానిక్ దగ్గరకు తీసుకుపోతే రూ.500 నుంచి వెయ్యి రూపాయలలో బాగుచేసుకొని వస్తున్నాం. స్మార్ట్ టీవీ కొనాలంటే లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినా ఒక్కసారి రిపేర్ వస్తే అదే లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకే సార్ట్ టీవీల జోలికి వెళ్లకుండా పోర్ట్‌బుల్ టీవీనే వాడుతున్నాం.
– అమర్‌నాథ్‌రెడ్డి, వినాయకపురం, ఐరాల
సెల్‌ఫోన్‌తోనే సమయమంతా..
ఒకప్పుడు చేతికి గడియారం ఉంటే హుందాగా భావించేవారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారు రంగు వాచీలకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు కూడా వాచ్‌లు పెట్టుకునేవారు ఉన్నారు. గతంలో అలారం వాచ్‌లు ఎక్కువగా ఉపయోగించేవారు. త్వరగా లేవాలంటే అలా రం పెట్టుకుని లేచేవారు. ఇప్పుడు చూద్దామన్నా అవి కనిపించడం లేదు. సెల్‌ఫోన్ రావడంతో అందులోనే నచ్చిన పాటలు పెట్టుకుని అలారం మోగే కొద్ది సమయానికి ముందుగా నిద్రిస్తున్నారు. కానీ కొందరు పాత తరం వారికి నాటి వినోద పరికరాలతో బంధం నేటికీ కొనసాగుతోంది. అలనాటి జ్ఞాపకాలను వారు మరిచిపోకుండా వినియోగిస్తున్నారు.
అపూర్వం.. అపురూపం
అపూర్వం.. అపురూపం
అపూర్వం.. అపురూపం