‘కూటమి’కి ఓటమి తథ్యం | Sakshi
Sakshi News home page

‘కూటమి’కి ఓటమి తథ్యం

Published Sat, Apr 13 2024 12:35 AM

సభలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  - Sakshi

సదుం : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటమి తథ్యమని, వైఎసా్‌స్‌ర్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం సదుం మండలంలోని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, తమ హయాంలో ఈప్రాంతం రైతుల కోసం మూడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అనంతరం న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి ఒక్క సంవత్సరంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. కూటమి గెలిస్తే మైనార్టీలకు సమస్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగారని, ఆయనపై పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెపితే అమ్మ ఒడి లాంటి ఎన్నో పథకాలు గుర్తుకువస్తాయన్నారు. సీఎం చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో అలాంటి పథకం ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. పేదలను సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఘనత జగన్‌దని, జన్మభూమి కమిటీలతో దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అమలు కాని హామీలతో మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఆసరా నాలుగో విడత మొత్తం త్వరలోనే మహిళల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. సీఎం కిరణ్‌ దుర్మార్గ ఆలోచనలతో రాష్ట్రం విడిపోవడంతో పాటు తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నిలుపుతామని హామీ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీలోకి బీసీవై నేతలు

పుంగనూరు మండలానికి చెందిన బీసీవై పార్టీ నేతలు శుక్రవారం తిమ్మానాయనపల్లెలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో ఉలవల దిన్నెకు చెందిన హితేష్‌, మునేష్‌, గణేష్‌, ఆనంద, విజయ్‌, హరి, రవి, చెంగప్ప, బాలాజీ కాలనీకి చెందిన మహేష్‌, శాంతినగర్‌కు చెందిన శివ ఉన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, రెస్కో చైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ సుబ్రమణ్యంరెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు లీలాధరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లప్ప, పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ రెడ్డెప్పరెడ్డి, జేసీఎస్‌ ఇన్‌చార్జి ప్రకాష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీలు ధనుంజయరెడ్డి, అమరావతి, నాయకులు రాజారెడ్డి, తిమ్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆనంద, మల్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పుట్రాజు, వినోద్‌, శివారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, వెంకటస్వామి, బాబురెడ్డి, ఎల్లారెడ్డి, గౌరీరెడ్డి, రమేష్‌రెడ్డి, చిన్నరమణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన వారితో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
1/1

పార్టీలో చేరిన వారితో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement