
రూ.1,762 కోట్లు సమీకరించిన సంస్థ
ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాంను రూపొందించే దిశగా 20 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1,762 కోట్లు) సమీకరించినట్లు కన్జూమర్ టెక్నాలజీ సంస్థ నథింగ్ తెలిపింది. 1.3 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఈ మొత్తాన్ని సమకూర్చుకున్నట్లు వివరించింది. టైగర్ గ్లోబల్ సారథ్యంలో ప్రస్తుత షేర్‌హోల్డర్లు జీవీ, హైల్యాండ్ యూరప్, ఈక్యూటీ మొదలైనవి పెట్టుబడులు పెట్టగా, జిరోధా సహ–వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, క్వాల్‌కామ్ వెంచర్స్ కొత్తగా ఇన్వెస్ట్ చేసినట్లు నథింగ్ తెలిపింది.
కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలకు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు వివరించింది. ఈ ఏడాది ప్రారంభంలో మొత్తం 1 బిలియన్ డాలర్ల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు నథింగ్ తెలిపింది. వచ్చే ఏడాది ప్రాథమికంగా ఏఐ సాంకేతికతతో పనిచేసే డివైజ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. లండన్ ప్రధాన కేంద్రంగా పని చేసే నథింగ్ తమ తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఈ ఏడాది భారత్‌లో ప్రారంభించనుంది.
ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్