10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ | Sakshi
Sakshi News home page

10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్

Published Thu, Mar 11 2021 3:11 PM

Xiaomi Working on a Phone With 200W Fast Charging - Sakshi

సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్‌లో ఉండే బ్యాటరీ కెపాసిటీని బట్టి 1 నుంచి 2 గంటలు సమయం పడుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జర్స్ టెక్నాలజీ మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఛార్జింగ్ సమయం ఒక గంట లేదా అంతకన్నా తక్కువకు తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను 40 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. అంతే కాకుండా, 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేయొచ్చు. ఒప్పో కూడా 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 

ఇప్పటి వరకు 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. కానీ, చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తయారీపై దృష్ట్టి సారించినట్లు సమాచారం. 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌ను 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వైర్డ్, వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో షియోమీ అందించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే షియోమీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. త్వరలో రాబోయే షియోమీ ఎంఐ 11 అల్ట్రాలో ఈ టెక్నాలజీ తీసుకోని రావచ్చు.

Advertisement
Advertisement