ఐఫోన్ 12/11 కొనేముందు ఒక్కసారి ఆలోచించండి | why you should NOT buy an Apple iPhone 12, 11 right now | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 12/11 కొనేముందు ఒక్కసారి ఆలోచించండి

Sep 8 2021 7:38 PM | Updated on Sep 8 2021 7:40 PM

why you should NOT buy an Apple iPhone 12, 11 right now - Sakshi

మీరు కొత్త ఐఫోన్ 12 కొనాలని చూస్తున్నారా?, మీరు ఐఫోన్ 11ను తక్కువ ధరకు కొనాలని అనుకుంటున్నారా? ఒకవేళ అవును అయితే. ఇప్పుడే కొత్త ఐఫోన్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళకండి. ఎందుకంటే, ఆపిల్ ఐఫోన్ 12 ఫోన్లను కొనడానికి ఇది సరైన సమయం కాదు అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆపిల్ తన తర్వాతి తరం మొబైల్ ఐఫోన్​ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్లను మన దేశంలో వచ్చే నెల తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐఫోన్ లాంఛ్ సమావేశంలో ఆపిల్ తన పాత ఐఫోన్ల కొత్త ధరలను, లభ్యత వివరాలను ప్రకటిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఐఫోన్ 13 లాంఛ్ చేసిన తర్వాత ఐఫోన్ 12, ఐఫోన్ 11 ధరలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. (చదవండి: ఈవీ ఛార్జింగ్ సమస్యలను సులభంగా చెక్ పెట్టొచ్చు: ఓలా సీఈఓ)

ప్రస్తుతం ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ ప్రారంభ ధర రూ.69,900గా ఉంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి థర్డ్ పార్టీ ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు సేల్స్ లో భాగంగా తక్కువ ధరకు తీసుకొనివస్తాయి. తర్వాతి తరం ఐఫోన్ విడుదల చేసిన తర్వాత ప్రస్తుతం ఐఫోన్ ఫోన్ల మీద ఉన్న డిస్కౌంట్ కంటే ఎక్కువ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అలాగే, కొత్త ఐఫోన్ 13, ఐఫోన్ 12 ధర దగ్గరలో గనుక ఉంటే మీరు ఒక మంచి అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు. ఆపిల్ నుంచి రాబోయే ఐఫోన్ 13 వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన డిస్ ప్లే టెక్నాలజీ, అద్భుతమైన కెమెరాల టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో, కొత్త ఐఫోన్ 13 అక్టోబర్ 1న అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి మీరు ఐఫోన్ ఎప్పడూ కొనుగోలు చేయాలో మీరే ఒక తెలివైన నిర్ణయం తీసుకుంటే మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement