Union Bank: యూనియన్‌ బ్యాంక్‌ ఆశలు.. రూ.15,000 కోట్లు!

Union Bank Ceo Says Expects To Recover Bad Loans 15000 Crore - Sakshi

     2022–23లో రూ.15,000 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొండి బకాయిల (ఎన్‌పీఏలు) వసూలుపై బలమైన అంచనాలతో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.15,000 కోట్లు వసూలు అవుతాయని భావిస్తోంది. ఇందులో రూ.10,000 కోట్ల వరకు ఎన్‌సీఎల్‌టీ పరిధిలో దివాలా పరిష్కారం కోసం చూస్తున్న రుణ ఖాతాల నుంచి వస్తాయని అంచనా వేస్తున్నట్టు విశ్లేషకులతో నిర్వహించిన సమావేశంలో బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఎ.మణిమేఖలై స్పష్టత ఇచ్చారు.

కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్‌ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)కి కొన్ని రుణ ఖాతాలను బదిలీ చేయనున్నట్టు చెప్పారు. రూ.4,842 కోట్ల విలువ చేసే రుణ పరిష్కార దరఖాస్తులను ఎన్‌సీఎల్‌టీ ఇప్పటికే ఆమోదించినట్టు.. మరో 55 ఖాతాలకు సంబంధించి రూ.5,168 కోట్ల ఎక్స్‌పోజర్‌కు ఆమోదం లభించాల్సి ఉన్నట్టు తెలిపారు. జూన్‌ త్రైమాసికంలో ఎన్‌సీఎల్‌టీ పరిష్కారాల రూపంలో యూనియన్‌ బ్యాంకుకు రూ.122 కోట్ల మొండి రుణాలు వసూలయ్యాయి.

చదవండి: Sahara Group: సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top