టెక్‌ మహీంద్రా చేతికి కెనడా ఐటీ కంపెనీ | Tech Mahindra Acquisition Canadian IT Firm Aluri Technologies Joins Tech M Family | Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్రా చేతికి కెనడా ఐటీ కంపెనీ

May 2 2026 3:21 PM | Updated on May 2 2026 3:23 PM

Tech Mahindra Acquisition Canadian IT Firm Aluri Technologies Joins Tech M Family

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా కెనడా కంపెనీ అల్లూరి టెక్నాలజీస్‌ ఇంక్‌(అవాంట్‌)ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 85% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.8 కోట్ల కెనడియన్‌ డాలర్లు(రూ. 171 కోట్లు) వెచి్చంచనుంది. మూడేళ్ల తదుపరి మిగిలిన 15% వాటాను ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు టెక్‌ మహీంద్రా పేర్కొంది.

అవాంట్‌తో.. సొంత అనుబంధ కంపెనీ టెక్‌ మహీంద్రా కన్సల్టింగ్‌ గ్రూప్‌(టీఎంసీజీ) వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. తాజా కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసులు, ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో మరింత బలపడే వీలున్నట్లు తెలియజేసింది. 2029 జూన్‌ 30కల్లా మిగిలిన 15% వాటా సైతం దక్కించుకోనున్నట్లు వెల్లడించింది.

ఈ కొనుగోలు ద్వారా ఉత్తర అమెరికా మార్కెట్‌లో టెక్‌ మహీంద్రా తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకోనుంది. ముఖ్యంగా అల్లూరి టెక్నాలజీస్‌కు ఉన్న డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ నైపుణ్యం, టెక్‌ మహీంద్రా గ్లోబల్ నెట్‌వర్క్‌కు తోడవ్వడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement