
సెమీకండక్టర్ మెటీరియల్ టెక్నాలజీ దిగ్గజం మెర్క్ ఎల్రక్టానిక్స్‌తో టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా గుజరాత్‌లోని ధోలెరాలో ఏర్పాటు చేస్తున్న చిప్ ప్లాంటుకి అవసరమైన పూర్తిస్థాయి ప్రొడక్టులు, సర్విసులను ఔట్‌సోర్సింగ్ చేసుకోనుంది.
దీనిలో భాగంగా హైప్యూరిటీ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, అడ్వాన్స్‌డ్ గ్యాస్, కెమికల్ డెలివరీ సిస్టమ్స్ తదితరాలను సమకూర్చుకోనుంది. 2025 సెమీకాన్ ఇండియా సదస్సు సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.