చదివిన కాలేజీకే మళ్లీ.. ఎందుకో తెలుసా? | Sundar Pichai Returns to Stanford for 2026 Commencement | Sakshi
Sakshi News home page

Sundar Pichai: చదివిన కాలేజీకే మళ్లీ.. ఎందుకో తెలుసా?

Apr 4 2026 8:53 PM | Updated on Apr 5 2026 11:04 AM

Sundar Pichai Returns to Stanford for 2026 Commencement

ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక కంపెనీలలో ఒకటి అయిన గూగుల్, దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2026 జూన్‌లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారికంగా వెల్లడించింది.

సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోనే మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసి 1995లో గ్రాడ్యుయేట్ పట్టా  పొందారు. అంటే 31ఏళ్ల తరువాత సుందర్ తాను చదివిన కాలేజీకి ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు.

సుందర్ పిచాయ్ భారతదేశంలో జన్మించారు. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ లో ఇంజనీరింగ్ చదివి ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ మెడల్ పొందారు. తరువాత వార్టన్ స్కూల్ నుండి MBA పూర్తి చేసి.. సీబెల్, పాల్మర్ స్కాలర్ అవార్డులు పొందారు.

చదువు పూర్తయిన తరువాత గూగుల్ కంపెనీలో చేరి, గూగుల్ టూల్‌బార్, గూగుల్ క్రోమ్ వంటి ప్రధాన ప్రాజెక్టులలో పనిచేశారు. ఆ తరువాత ఇది క్రోమ్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్ అయింది. 2019లో గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ సీఈఓగా నియమితులు అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement