ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార‍్కెట్లు

Stock Market Live Updates Sensex, Nifty Open Flat   - Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నడుమ దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం  స్వల్ప లాభాలతో  ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం సెన్సెక్స్‌ 52,653 పాయింట్లతో క్లోజవగా ఈ రోజు ఉదయం  52,792 పాయింట్లతో  ప్రారంభమయ్యింది.  ఉదయం 9:45 గంటల సమయంలో కేవలం పది పాయింట్ల లాభపడి 52,663 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఉదయం 9:45 గంటల సమయానికి ఏడు పాయింట్లు లాభపడి 15,785 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

టెక్‌ మహీంద్రా షేర్లు ఏకంగా 7 శాతం పెరిగాయి. ఈ రోజు మార్కెట్‌లో అధిక లాభాలు అందించిన షేర్‌గా టెక్‌మహీంద్రా నిలిచింది. ఐటీ, ఆటోమొబైల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాల‍్ని చవిచూస్తున్నాయి.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top