స్టాక్‌ మార్కెట్లు ముగిశాయిలా.. | Stock Market closing April 1 Sensex settles off days high | Sakshi
Sakshi News home page

ప్రారంభ లాభాలు పడినా.. స్టాక్‌ మార్కెట్లు ముగిశాయిలా..

Apr 1 2026 3:49 PM | Updated on Apr 2 2026 3:41 PM

Stock Market closing April 1 Sensex settles off days high

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్-ఇరాన్ యుద్ధం ముగింపు వార్తల నేపథ్యంలో ఉదయం అత్యంత భారీ లాభాలలో పయనించాయి. అయితే ప్రారంభ ఉత్సాహం మసకబారడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెషన్‌ ద్వితీయార్ధంలో రోజు గరిష్ట స్థాయి నుండి లాభాలు క్షీణించాయయి.

ముగింపు సమయానికి నిఫ్టీ 1.56 శాతం లేదా 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం పెరిగి 73,134.34 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.24 శాతం, 3.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ టాప్‌ గెయినర్‌గా ఉంది. నిఫ్టీ కెమికల్, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా నష్టాల్లో నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement