రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల

Sony Xperia Pro With Micro HDMI Port Launched for Professional Photographers - Sakshi

సోనీ కంపెనీ చివరకు ఫ్లాగ్‌షిప్‌గా పిలవబడే ఎక్స్‌పీరియా ప్రో విడుదల చేసింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రీ-వ్యూ కోసం ఫోన్లో డబుల్ మానిటర్ ఇందులో ప్రవేశపెట్టారు. దింతో పాటు ఫోన్‌కి మైక్రో హెచ్‌డిఎంఐ కనెక్టర్ అందించారు. దీని సహాయంతో సోనీ ఎక్స్‌పీరియా ప్రో యూజర్లు తమ ఫుటేజీని కెమెరా నుంచి ఎఫ్‌టిపికి బదిలీ చేసుకోవచ్చు. అలాగే కెమెరాను ఫోన్‌కు కనెక్ట్ చేసి4కె ఓఎల్ఈడి డిస్ప్లే మానిటర్ తరహాలో లైవ్ ఫీడ్‌ను చూడవచ్చు. సోనీ ఎక్స్‌పీరియా ప్రో 5జీ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.(చదవండి: వాట్సాప్ పేకు గట్టి ఎదురుదెబ్బ)

 
సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఫీచర్స్: 
ఇందులో 6.5 అంగుళాల 4కే హెచ్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6రక్షణతో వస్తుంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపీ ఎఫ్/ 1.7లెన్స్‌తో ఎక్స్‌మోర్ ఆర్‌ఎస్‌ను కలిగి ఉంది. మిగిలిన రెండు కెమెరాలు 124-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్‌ఓవి)తో ఎఫ్ / 2.2 లెన్స్, ఎఫ్/2.4 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రో ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగిఉంది.(చదవండి: రిలయన్స్ జియోకు ఎయిర్‌టెల్ షాక్)

 సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మైక్రో-హెచ్‌డిఎంఐ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీతో వస్తుంది. ఇది ఎక్స్‌పీరియా అడాప్టివ్ ఛార్జింగ్, యుఎస్‌బి పవర్ డెలివరీ(పిడి)ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది. ఇది 225 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

సోనీ ఎక్స్‌పీరియా ధర:
ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో ఉన్న ఈ వేరియంట్ ధరను $2,499(సుమారు రూ.1,82,500)గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, బీఅండ్‌హెచ్ ఫొటో వీడియో, సోనీ ఆన్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top