ఈ బ్యాంక్‌ లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే ఇంట్రస్ట్‌ ఎక్కువగా వస్తుందా

some Banks That Offer Up To 7.25 Percent Interest On 3 Year Fds For Senior Citizens - Sakshi

ఎలాంటి రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్‌ సిటిజన్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకుంటారు. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇంటస్ట్ర్‌ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి.  పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇంట్రస్ట్‌ రేట్లు తగ్గుతున్నప్పటికీ కొన్ని బ్యాంక్‌ లు మాత్రం మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై 7.25 శాతం ఇంట్రస్ట్‌ ను చెల్లిస్తున్నట్లు 'బ్యాంక్‌ బజార్‌' తన డేటాలో వెల్లడించింది.  . ఇప్పుడు మనం ఎఫ్‌డీపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. 
 
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్స్ కోసం మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష రూపాయల మొత్తం మూడు సంవత్సరాలలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్‌ రూ.1,000.

డీసీబీ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌ -  సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని అందిస్తాయి. రూ .1 లక్ష డిపాజిట్‌ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.23 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్‌ రూ. 10,000.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది.

ఆర్‌బిఎల్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు కోసం మూడు సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top