స్వల్పంగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

Sensex Ends Flat with Negative Bias, Nifty Closes at 15763 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ యూ-టర్న్ తీసుకొని స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. దేశీయ ఫార్మా, ఆటో ఇండస్ట్రీ షేర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 66.23 పాయింట్లు (0.13%) క్షీణించి 52586.84 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15.50 పాయింట్లు(0.10%) నష్టపోయి 15763 వద్ద ఉంది. నేడు సుమారు 1808 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1352 షేర్లు క్షీణించాయి, 126 షేర్లు మారలేదు.‎ నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.40 వద్ద ఉంది.‎

నేడు బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి.‎ ‎సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, సిప్లా, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్ షేర్లు టాప్ నిఫ్టీ గెయినర్లుగా నిలిస్తే.. హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు టాప్ లూజర్లుగా ఉన్నాయి.‎
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top