ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్‌! | Hetero Launches Generic Semaglutide Exports For Diabetes And Obesity Treatment | Sakshi
Sakshi News home page

ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్‌!

Mar 29 2026 5:25 PM | Updated on Mar 29 2026 6:35 PM

Semaglutide Exports Begin

మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే సెమాగ్లూటైడ్‌ ఇంజెక్షన్‌ జనరిక్‌ వెర్షన్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హెటిరో వెల్లడించింది. ట్రూగ్లిక్స్, రోల్‌మోడల్, మోటో జీ బ్రాండ్ల పేరుతో వీటిని విక్రయించనున్నట్లు వివరించింది. ఇవి డిస్పోజబుల్‌ పెన్‌ డివైజ్‌ల రూపంలో 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు వివిధ డోసేజీల్లో లభిస్తాయి.

75 పైగా దేశాలకు దశలవారీగా వీటిని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ముందుగా ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీవో అనుమతులు వచ్చాక దేశీయంగా కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అందుబాటు ధరలో నాణ్యమైన జనరిక్‌ సెమాగ్లూటైడ్‌ని అందించాలనేది తమ లక్ష్యమని హెటిరో ఎండీ వంశీకృష్ణ బండి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement