రూ.3.8 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ: ఇలా.. | From Rs 3 8 Lakh To Rs 27 Lakh Salary Techie Post Viral | Sakshi
Sakshi News home page

రూ.3.8 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ: ఇలా..

May 22 2026 3:28 PM | Updated on May 22 2026 4:01 PM

From Rs 3 8 Lakh To Rs 27 Lakh Salary Techie Post Viral

నిబద్దతతో.. కష్టపడి పని చేస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అందరూ చెబుతుంటారు. కొందరు దీనిని నిజం చేసుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన పూణేకు చెందిన టెకీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువ టెకీ.. కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల, నమ్మకంతో ఎలా జీవితాన్ని మార్చుకున్నాడో వెల్లడించారు. ఇందులో రూ.3.8 లక్షల వార్షిక వేతనంతో ప్రారంభమైన అతని ప్రయాణం చివరకు రూ. 27 లక్షల ప్యాకేజీ వరకు చేరిందని స్పష్టం చేశారు.

పూణేలోని ఒక  కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన టెకీ.. కాలేజీ ప్లేస్‌మెంట్ల సమయంలో దాదాపు 30 నుంచి 35 ఇంటర్వ్యూలలో విఫలమయ్యాడు. వరుసగా ఎదురైన తిరస్కారాలు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయినప్పటికీ.. అతనికి కోడింగ్‌పై ఉన్న ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. చివరకు అతనికి ఒక కంపెనీలో రూ.3.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చింది.

జాబ్ వచ్చింది కానీ.. కరోనా కారణంగా జాయినింగ్ చాలా ఆలస్యమైంది. 2020లో వచ్చిన ఆఫర్‌కు 2021 ఫిబ్రవరిలో మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం దొరికింది. మొదటి ఆరు నెలలు జీతం సుమారు రూ.20 వేలు ఉండేది, చేరే తేదీ వరకు కూడా పని చేసే ప్రదేశం గురించి స్పష్టంగా తెలియదని టెకీ పేర్కొన్నారు.

మొదటి ఉద్యోగంలోనే ఒకటిన్నర సంవత్సరాలు పని చేసి, చివరికి 6 లక్షల వార్షిక ప్యాకేజీతో మరో కంపెనీకి మారాడు. ఆ సంస్థలో ఒక సంవత్సరం తర్వాత నాకు 25 శాతం జీతం పెంపు లభించింది. కంపెనీ స్థిరంగానే ఉండేది, కానీ కొత్త విషయాలను నిర్మించడంలో పెద్దగా ఉత్సాహం లేదని నేను గ్రహించాడు. అలాంటి సమయంలోనే నెలకు రూ.45 వేల జీతంతో తన స్నేహితుడి స్టార్టప్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆ జీతం అంతకు ముందు వచ్చేదానికంటే చాలా తక్కువ.

What Helped Me Grow from 3.5 to 27 as a Flutter Developer
by u/Presence_Small in developersIndia

స్నేహితులతో కలిసి మొదటి నుంచి ఉత్పత్తులను తయారు చేయాలనే ఆలోచన తనకి బాగా నచ్చింది. నిజానికి.. అక్కడ ఉద్యోగిగా చేరకముందే, తాను ఆ పనిని ఇష్టపడటం వల్ల రాత్రిపూట వారి స్టార్టప్ కోసం పార్ట్‌టైమ్‌గా పని చేసేవాడు. ఆ దశలోనే చాలా నేర్చుకున్నాడు. సున్నా నుంచి ఉత్పత్తి వరకు ఉత్పత్తులను ఎలా నిర్మించాలి, క్లయింట్‌లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒత్తిడి, గడువులను ఎలా ఎదుర్కోవాలి, నాయకత్వం, యాజమాన్యం వంటి వాటితో పాటు.. నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా తెలుసుకున్నాడు.

కొంతకాలం తర్వాత.. మళ్లీ ఉద్యోగ మార్పు కోసం సిద్ధమయ్యాడు. ఈసారి అతను ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయ్యాడు. అయినప్పటికీ.. మొదట్లో రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షలు వేతనంతో ఆఫర్లు ఇచ్చే కంపెనీల్లో తిరస్కరణ ఎదురైంది. కారణం కొన్ని టెక్నికల్ విషయాల్లో లోతైన అవగాహన లేకపోవడం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం. కానీ ఈసారి అతను నిరుత్సాహపడలేదు. తన తప్పులను గుర్తించి మరింత కష్టపడ్డాడు. మరో 10 నుంచి 15 ఇంటర్వ్యూలు ఇచ్చి చివరకు మూడు కంపెనీల ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీ ఆఫర్లు పొందాడు.

ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!

ఇదిలా ఉండగా.. ఒక కంపెనీ వ్యవస్థాపకుడు నా ప్రొఫైల్ చూసి నేరుగా సంప్రదించాడు. చివరకు రూ.27 లక్షల జీతంతో ఉద్యోగ అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఆప్టిట్యూడ్ రౌండ్స్ కూడా క్లియర్ చేయలేక ఇబ్బంది పడ్డ వ్యక్తి, తర్వాత కంపెనీ వ్యవస్థాపకులే సంప్రదించే స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయం. దీన్నిబట్టి చూస్తే.. విజయానికి పట్టుదల, కృషి, నేర్చుకునే తపన ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement