సరకు రవాణా ఖర్చులు తగ్గించాలి

Road Transport Minister Nitin Gadkari Says Equilibrium Between Ecology, Environment And Development - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వాటాదారులు మధ్య సహకారం, సమన్వయం, కమ్యునికేషన్లతో సరకు రవాణా ధరను 14 శాతం, 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ పిలుపునిచ్చారు. తద్వారా ఎగుమతుల్లో 50 శాతం పెరుగుదల సాధించొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో‘ క్‌లైమేట్‌ గోల్స్‌: టెక్నలాజికల్‌ రోడ్‌ మ్యాప్‌ టు నెట్‌ జీరో ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.

కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిపి పని చేస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరసం ఉందన్నారు. భారతదేశంలో యువ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్‌ మానవశక్తితోపాటు తక్కువ కార్మిక వ్యయంతో దేశీయ మార్కెట్‌ ఉందన్నారు. బయో ఇథనాల్, బయో సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఆవశ్యకత వివరించారు. ఏటా 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 27 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు రూపొందించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి గడ్కరీ వివరించారు.

చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! 

  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top