RBI Policy review: రెపో రేటు పెంపు, ఈఎంఐలు మరింత భారం!

Repo rate hiked by 25 bps announces Governor Shaktikanta Das - Sakshi

సాక్షి,ముంబై:  రిజర్వ్‌ బ్యాంకు  ఇండియా (ఆర్‌బీఐ)  అంచనాలకు అనుగుణంగానే  రెపో రేటు పావు శాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది.  దీంతో  6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. అలాగే  ఎంఎస్‌ఎప్‌ రేట్లు 25 బీపీఎస్‌ పాయింట్లు పెరిగి 6.75శాతానికి చేరింది. 

 జీడీపీ వృద్ధి అంచనాలు
2023 ఆర్థిక సంవత్సరం  స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 6.8 శాతం నుండి 7 శాతానికి పెరిగింది. 2023-24లో GDP వృద్ధిని 6.4శాతంగా అంచనా వేసింది

ఆర్‌బీఐగవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం (ఫిబ్రవరి8, 2023) ద్రవ్య విధాన ప్రకటనను ప్రకటించారు.  ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటు, తాజా పెంపుతో కలిపి 250 బేసిస్ పాయింట్లు పెంచింది. 

పెరగనున్న రుణ భారం
తాజా రేట్ల పెంపు ప్రభావం అన్ని రకాల రుణాల రేట్లపై భారం పడనుంది. ఇప్పటికే వరుసగా పెరిగిన వడ్డీ రేట్ల  కారణంగా రుణ వినియోగదారులపై భారం పడుతున్న సంగతి తెలిసిందే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top