జియో డౌన్‌.. గగ్గోలు పెడుతున్న యూజర్లు | Reliance Jio Faces Outage In Few Circles Along Mumbai | Sakshi
Sakshi News home page

జియో నెట్‌వర్క్‌ డౌన్‌.. ముంబైలో నో ఇన్‌కమింగ్‌, అవుట్‌ గోయింగ్‌! పలు సర్కిల్స్‌లో కూడా?

Feb 5 2022 1:55 PM | Updated on Feb 5 2022 1:58 PM

Reliance Jio Faces Outage In Few Circles Along Mumbai - Sakshi

దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబై సర్కిల్‌లో..

Reliance Jio Outage: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ ఒక్కసారిగా డౌన్‌ అయ్యింది. ముఖ్యంగా ముంబై టెలికాం సర్కిల్‌ పరిధిలో నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాల్స్‌ ఇన్‌కమ్‌, అవుట్‌గోయింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు యూజర్లు. 

ఇదిలా ఉంటే ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల నాలుగైదు రోజుల నుంచి నెట్‌వర్క్‌ సరిగా పని చేయడం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జియో నుంచి మాత్రమే కాదు.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్‌ కనెక్ట్‌ కావడం లేదనే ఫిర్యాదు అందుతున్నాయి.

అంతరాయానికి కారణం ఏంటన్నది స్పష్టం చేయని జియో నెట్‌వర్క్‌.. యూజర్లకు వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. అంతవరకు ప్రత్యామ్నాయ సిమ్‌ లేదంటే ఇంటర్నెట్‌ బేస్డ్‌ సేవల్ని వినియోగించుకోవాలని యూజర్లకు విజ‍్క్షప్తి చేస్తోంది. మరోపక్క నెట్‌వర్క్‌ పని చేయకపోవడంపై ఇతర నెట్‌వర్క్‌  యూజర్లు మీమ్స్‌తో ఎంజాయ్‌ చేస్తు‍న్నారు.

Advertisement
 
Advertisement
Advertisement