నీటి సంరక్షణ కోసం మహా ఉద్యమం | Reliance Foundation Great Movement For Water Conservation | Sakshi
Sakshi News home page

Reliance Foundation: నీటి సంరక్షణ కోసం మహా ఉద్యమం

Apr 3 2026 4:52 PM | Updated on Apr 3 2026 5:04 PM

Reliance Foundation Great Movement For Water Conservation

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం 2026 సందర్భంగా ప్రారంభమైన #Water4Life దేశవ్యాప్త ప్రచారం ద్వారా 33,000కు పైగా స్వచ్ఛంద కార్యకర్తలు, భారతదేశం అంతటా.. నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ కోసం కలిసి పనిచేస్తున్నారు.

తొలి 10 రోజుల్లోనే, ఈ కార్యక్రమం ద్వారా 912 గ్రామాలలో 1,400కు పైగా జల వనరులను శుబ్రపడిచారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 108 జిల్లాలకు విస్తరించింది. తక్షణ చర్యలైన చెత్త తొలగింపు, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో పాటు, దీర్ఘకాలికంగా సముదాయం ఆధారిత నీటి నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.

ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా సంఘాలు, యువత, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక సంస్థలు మరియు ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే 15 జిల్లాల్లోని 146 గ్రామాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి.

ఇప్పటివరకు ఈ ప్రచారం ద్వారా 85,000 కిలోలకుపైగా చెత్త సేకరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, చెత్త వేరు చేయడం వంటివి మాత్రమే కాకుండా.. నీటి సహజ ప్రవాహ వ్యవస్థల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రిలయన్స్ ఫౌండేషన్ శిక్షణ ఇచ్చిన 2,500 గ్రామ వాతావరణ ఛాంపియన్లు అవగాహన పెంపు, దీర్ఘకాలిక చర్యలకు కీలక పాత్ర పోషిస్తున్నారు.

#Water4Life ప్రచారం.. ఇప్పటికే 91,000కు పైగా గ్రామాల్లో కొనసాగుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు ఆధారంగా ఉంది. ఫౌండేషన్ చేపట్టిన నీటి సంరక్షణ చర్యల ద్వారా ఇప్పటివరకు 2,000 లక్షల ఘన మీటర్లకు పైగా నీటి నిల్వ సాధ్యమై, లక్షలాది మందికి ప్రయోజనం కలిగింది.

నీతా అంబానీ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో సాగించే స్థిరమైన ఉద్యమంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సముదాయం భాగస్వామ్యం మరియు సంస్థల సహకారంతో జల వనరుల దీర్ఘకాల సంరక్షణపై దృష్టి కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement