కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా | RBI Slaps Rs 7 5 Lakh Fine on Himachal Pradesh State Cooperative Bank | Sakshi
Sakshi News home page

కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా

Apr 14 2026 8:05 PM | Updated on Apr 14 2026 9:01 PM

RBI Slaps Rs 7 5 Lakh Fine on Himachal Pradesh State Cooperative Bank

నిబంధనల ఉల్లంఘన విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ.7.50 లక్షల నగదు జరిమానాను విధిస్తూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఖాతాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో బ్యాంక్ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

తనిఖీలో వెలుగుచూసిన లోపాలు

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్‌) 31 మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయి. తనిఖీ నివేదిక ప్రకారం.. ఖాతాదారుల రిస్క్ ప్రొఫైల్‌ను కాలానుగుణంగా సమీక్షించే పటిష్టమైన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. ఆర్‌బీఐ నిర్దేశించిన కేవైసీ, ఇతర నియంత్రణ ప్రమాణాలను పాటించలేదు.

ఆర్‌బీఐ చర్యల నేపథ్యం

నిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరుతూ ఆర్‌బీఐ ఇదివరకే సదరు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలో ప్రతినిధులు చేసిన మౌఖిక వాదనలు, వారు సమర్పించిన అదనపు పత్రాలను ఆర్‌బీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, బ్యాంక్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

‘ఈ చర్య కేవలం రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. దీనికి బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు లేదా అది జరిపే లావాదేవీల చెల్లుబాటుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే, ఈ జరిమానా విధించడం వల్ల బ్యాంకుపై భవిష్యత్తులో తీసుకునే ఇతర చట్టపరమైన చర్యలకు ఎటువంటి ఆటంకం కలగదు’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Advertisement
 
Advertisement
Advertisement