మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్‌బీఐ..!

RBI Slaps Fine on Three Cooperative Banks, Details Here - Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నేడు(ఫిబ్రవరి 21) మూడు సహకార బ్యాంకుల(రెండు తమిళనాడు, ఒకటి జమ్మూ కాశ్మీర్)పై భారీ జరిమానా విధించింది. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘన నేపథ్యంలో కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్-కాంచీపురం, చెన్నై-సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బారాముల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మీద క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అందులో భాగంగన్ చెన్నై సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ పై ₹1 లక్షల జరిమానా, మిగిలిన రెండు బ్యాంకులపై ₹2 లక్షల జరిమానా ఆర్‌బీఐ విధించినట్లు తెలిపింది. 

బారాముల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ విషయంలో నాబార్డ్ నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలలో కొన్ని విభాగాల పనితీరు చట్ట విరుద్ధంగా ఉందని ఆర్‌బీఐ తెలిపింది  నిర్దిష్ట ఆర్‌బీఐ ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు డిపాజిట్లను సేకరించినట్లు తేలడంతో జరిమానా ఎందుకు విధించకూడదో కారణం తెలపాలని బ్యాంకుకు సలహా ఇస్తూ నోటీసు జారీ చేసింది. బ్యాంకు సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిబందనలు ఉల్లంఘన అభియోగాలు రుజువు కావడంతో జరిమానా విధించినట్లు తెలిపింది. మరో కేసులో, బిగ్ కాంచీపురం కో-ఆపరేటివ్ బ్యాంకును తనిఖీ చేసినప్పుడు ఆర్‌బీఐ నిబందనలను ఉల్లగించడంతో బ్యాంకుకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

(చదవండి: అదిరిపోయిన హీరో స్ప్లెండ‌ర్ ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top