రుచించని పాలసీ: అమ్మకాల సెగ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి.ముఖ్యంగా ఆర్‌బీఐ పాలసీ రివ్యూ తరువాత కీలక సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో ప్లాట్‌గా ఉన్నా మార్కెట్...వెంటనే లాభాల పట్టింది. రికార్డు స్థాయిలకు ఎగిసింది. కానీ ఆర్‌బీఐ పాలసీ రుచించని ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో నష్టాలు తప్పలేదు. చివరికి సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టంతో 52100 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 15670 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్, ఐటీతోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. నిఫ్టీ బ్యాంకు 350 పాయింట్లు కోల్పోయింది.మిడ్, అండ్ స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిసాయి.
ఓఎన్‌జిసి, ఎల్ అండ్ టి, టెక్ మహీంద్రా,ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ సెన్సెక్స్ గెయినర్స్. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్ రిలయన్స్ నష్టపోయాయి. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.
చదవండి : Anil Ambani: నా రెక్కల బలానివి నువ్వు!
కరోనా సెకండ్ వేవ్ : ఆర్‌బీఐ కీలక నిర్ణయం
ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడి!