ప్రొటీన్‌ ఈగవ్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు ఆమోదం | Sakshi
Sakshi News home page

ప్రొటీన్‌ ఈగవ్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు ఆమోదం

Published Wed, Nov 23 2022 8:17 AM

Protean Egov Technologies Get Sebi Nod For Ipo - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సంబంధిత సేవల్లోని ప్రొటీన్‌ ఈ గవ్‌ టెక్నాలజీస్, బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీల ఐపీవోలకు సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఈ రెండు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) అనుమతి కోరుతూ ఈ ఏడాది ఆగస్ట్‌ ముందు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేశాయి. ఈ నెల 15–17 మధ్య సెబీ నుంచి వీటికి అనుమతి (అబ్జర్వేషన్‌) లభించింది. బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌/ప్రస్తుత వాటాదారుల అమ్మకం) రూపంలో 2,60,00,000 షేర్లను విక్రయించనుంది.

అలాగే, రూ.250 కోట్ల విలువైన తా జా షేర్ల జారీ చేయనుంది. ఇందులో రూ.68 కోట్లను రుణాలను చెల్లించేందుకు, రూ.120 కోట్లను మూలధన అవసరాలకు వినియోగించనుంది. ఇక ప్రొటీన్‌ ఈగవ్‌ టెక్నాలజీస్‌ (గతంలో ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా వాటాదారులకు విక్రయించనుంది. ఈ ఐపీవోతో కంపెనీకి వచ్చే నిధులు ఏమీ లేవు. ప్రస్తుత వాటాదారులైన యాక్సిస్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర కంపెనీలు వాటాలను విక్రయిస్తాయి.    

Advertisement
 
Advertisement
 

తప్పక చదవండి

Advertisement