PNB to Hike Repo-linked Lending Rate from next Month, Full Details in Telugu - Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ రుణ రేట్లు పెంపు..జూన్‌ 1 నుంచి అమల్లోకి!

May 13 2022 3:25 PM | Updated on May 13 2022 4:06 PM

Pnb To Hike Repo-linked Lending Rate From Next Month - Sakshi

న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను వచ్చే నెలలో పెంచనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) చీఫ్‌ అతుల్‌ కుమార్‌ గోయల్‌ తెలిపారు. 

రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై రిజర్వ్‌ బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీ రేటు) 40 బేసిస్‌ పాయింట్లు పెరిగిన నేపథ్యంలో తమ విధానం ప్రకారం జూన్‌ 1 నుంచి అదే పరిమాణంలో రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ఉండబోతోందని ఆయన వివరించారు.

 పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా ఆర్‌బీఐ గత వారం అనూహ్యంగా 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడంతో రెపో రేటు 4.4 శాతానికి చేరింది. దీంతో ఇప్పటికే పలు బ్యాంకులు దానికి అనుగుణంగా రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయగా, మరికొన్ని బ్యాంకులు డిపాజిట్ల రేట్లను కూడా పెంచాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement