PM KISAN eKYC Deadline Extended: పీఎం కిసాన్‌ ఈ-కేవైసీ అప్‌డేట్‌ గడువు పొడిగింపు 

PM Kisan Yojana eKYC last date extended again All details - Sakshi

న్యూఢిల్లీ: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్‌) పథకం  ద్వారా అర్హులైన కోట్లాదిమంది రైతులకు 12వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలోనే విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 1న ఈ నగదును  రైతుల ఖాతాల్లో జమచేయనుందని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.(వారెన్‌ బఫెట్‌ పోలికపై రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్‌)

మరోవైపు ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేసుకొని రైతన్నలకు మరో అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్‌డేట్‌ గడువును ఆగస్టు 31వ తేదీ దాకా పొడిగించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12వ విడత నగదు పొందాలంటే ఈ-కేవైసీ అప్‌డేట్‌ తప్పనిసరి. అప్‌డేట్‌ చేయకపోతే తదుపరి విడత నగదు రైతులకు రాదు. ఈనేపథ్యంలో ఈ ఈ-కేవైసీ అప్‌డేట్‌ ఎలా చేయాలో తెలుసుకుందాం. (లక్‌ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!)

పీఎం కిసాన్ నమోదిత అన్నదాతలు ఓటీపీ ఆధారంగా కూడా పీఎం కిసాన్ పోర్టల్లో  ఆఫ్‌లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో బయోమెట్రిక్ ఆధారంగా కూడా  సమీపంలోని సీఎస్సీ కేంద్రాలల్లో అప్డేట్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ అప్‌డేట్‌
ఇంట్లోనే  మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి
ఆ తర్వాత  కుడి వైపు ఉండే e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి
ఇక్కడ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ స్టెప్-4పై క్లిక్ చేయాలి. 
అనంతరం ఆధార్ కార్డుతో లింక్‌ అయిన  మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి.
సంబంధిత నంబరుకు వచ్చిన  ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

అదే  ఆఫ్‌లైన్‌లో అయితే  ఎలా
లబ్దిదారుడైన అన్నదాత సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లాలి. 
పీఎం కిసాన్ ఖాతా కోసం ఆధార్ అప్డేట్ సమర్పించాలి.
పీఎం కిసాన్ ఖాతాకు లాగిన్ అయ్యేందుకు బయోమెట్రిక్‏ ఇవ్వాల్సి ఉంటుంది.
అనంతరం ఆధార్ కార్డ్ నంబర్ అప్డేట్ చేసి, సబ్మిట్ చేసిన తర్వాత ఫోన్‌కు వచ్చే ఎస్ఎంఎస్ ద్వారి నిర్ధారించుకోవాలి.

అంతేకాదు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు.
PM కిసాన్  హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు.
 అధికారిక ఇ-మెయిల్ ఐడీని సంప్రదించి పరిష్కారం పొందవచ్చు.

దేశంలో అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు ఈ పథకంలో ఆర్థికఆసరా కల్పిస్తోంది కేంద్రం.తద్వారా రైతులకు వ్యవసాయ,సంబంధిత సామాగ్రి కొనుగోలు ఖర్చులకు సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున అందిస్తుంది. ఈ మొత్తాన్ని విడతకు రూ. 2000  చొప్పున ఏడాదిలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అంటే ప్రతి నాలుగు నెలలకోసారన్నమాట. దీనికి సంబంధించి నమోదు గడువు ఇప్పటిదాకా జూలై 31. అయితే ఇప్పటికే   ఈ డెడ్‌లైన్‌ను  వ్యవసాయ  మరియు రైతు సంక్షేమ శాఖ గడువును 3 సార్లు ( జూలై 31, మే 31, మార్చి 31) పొడిగించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top